ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్ ఒకటే  అనే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారుతోంది.  కొత్త టాలెంట్‌ బయటకు రావడంతో కొత్త కాన్సెప్ట్‌ చిత్రాలు వచ్చాయి . దీంతో దక్షిణాది సినిమా కంటెంట్‌ బలమేంటో అందరికీ అర్థమైంది. బాహుబలి, కెజిఎఫ్ ‌ వంటి చిత్రాలతో మన తెలుగు సినిమాలు పాన్ ‌  ఇండియా రేంజ్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ దుమ్మురేపాయి ..  దీంతో మన దర్శకుల ప్రతిభ దేశంలోనే కాదు  యావత్‌ ప్రపంచనికి  తెలిసింది. మన దక్షిణాదిన ముఖ్యంగా తెలుగులో మంచి సినిమాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఏకంగా మన దర్శకులే బాలీవుడ్‌లో పరిచయం అవుతూ అక్కడ సినిమాలను తెరకెక్కించడంమొదలుపెట్టారు  . ఇది వరకు సీనియర్‌ దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వంటి దర్శకులు బాలీవుడ్‌లో ఒకటి లేదా రెండు  సినిమాలను తెరకెక్కించారు ..

కానీ  ఇప్పుడు ట్రెండ్‌ మారింది. టాలీవుడ్ యువ దర్శకులు బాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి   గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆలా ఇప్పటివరకు టాలీవుడ్ లో చేసిన అదే సినిమాను అదే దర్శకుడితో బాలీవుడ్ లోను రీమేక్ చేయడం ఇదో కొత్త రకం ట్రెండ్ లాగా అనిపిస్తుంది .. హిందీ వాళ్ళు ఒరిజినల్ గా చేసిన దర్శకుడైతే తన సినిమాకి న్యాయం చేయగలదని భావించి అదే డైరెక్టర్ తో హిందీ లోను సినిమాని తెరకెక్కిస్తున్నారు .. అయితే హిందీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ లో మార్పులు చేసి సినిమా తీసిన కూడా కొన్ని చిత్రాలు బెడిసి కొడుతున్నాయి .. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో తెలుగు లో సినిమా చేసి అదే సినిమాని హిందీలో తెరెకెక్కించిన కొందరు దర్శకుల గురించి తెలుసుకుందాం ..

ముందుగా జెర్సీ సినిమాని తీసుకుంటే  తెలుగులో హీరో నానిని సరికొత్త కోణంలో చూపించిన ‌సినిమా 'జెర్సీ'. గౌతమ్‌ తిన్ననూరి ఈ  సినిమాను డైరెక్ట్‌ చేశాడు. నాని సినీ కెరీర్ లోనే జెర్సీ సినిమా ది బెస్ట్ గా నిలుస్తుంది .. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచినా జెర్సీ చిత్రం .. ఇప్పుడు బాలీవుడ్ కి  వెళ్తుంది.. ఇక్కడ కూడా  గౌతమ్‌ తిన్ననూరి సినిమాని తెరకెక్కించ బోతున్నాడు..  ఈ సినిమా ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్‌ 5న విడుదలవుతుంది. మరి ఈ సినిమాతో గౌతమ్‌ తిన్ననూరి బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతాడేమో వేచి చూడాలి ..

ఇక తెలుగులో విజయవంతమైన మరో చిత్రం  అర్జున్‌ రెడ్డి ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగా అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు .. అర్జున్ రెడ్డి చిత్రం   విజయ్‌ దేవరకొండను స్టార్‌ హీరోని చేసింది ..    రా లవ్‌స్టోరిని దర్శకుడు తెర తెరకెక్కించిన తీరుకి అద్భుతం . దీంతో తెలుగు అర్జున్ రెడ్డి సినిమాని మెచ్చిన బాలీవుడ్‌ అదే దర్శకుడితో కబీర్‌ సింగ్ ‌గా రీమేక్‌ చేశారు. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. ఇప్పుడు సందీప్ వంగా బాలీవుడ్‌లోనే సెట్టిల్ అయినట్లు కనిపిస్తుంది .. త్వరలో అయన  కొత్త ప్రాజెక్ట్ తో ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.. ..
అలాగే పిల్లజమీందార్‌ వంటి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయినా దర్శకుడు అశోక్.. ‌ అయన దర్శకత్వంలో  'భాగమతి'  సినిమా వచ్చింది ..  అనుష్క టైటిల్‌ పాత్రలో నటించిన   సూపర్‌హిట్‌ మూవీ   'దుర్గామతి' పేరుతో అతడి ‌ దర్శకత్వంలోనే హిందీ లో రీమేక్‌ చేశారు.. హిందీలో‌ అనుష్క పాత్రని భూమి ఫెడ్నేకర్ పోషించింది .. భారీ అంచనాల మధ్య సినిమా రాగా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం విశేషం  


మరింత సమాచారం తెలుసుకోండి: