యువ సెన్సేషనల్ కథానాయకుడు విజయ్ దేవరకొండ తొలిసారిగా హీరోగా నటించిన సినిమా పెళ్లి చూపులు. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా బిగ్ బెన్ సినిమాస్, ధర్మపాత క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ మూవీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. 2016లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి హీరోగా విజయ్ దేవరకొండ కెరీర్ కి మంచి పునాది వేసింది అని చెప్పాలి.

దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ కంటెంట్ మూవీగా ఆకట్టుకునే కథ కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి విజయ్ కి ఓవర్ నైట్ స్టార్ గా టాలీవుడ్ లో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. శాలిని పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ అత్యద్భుత నటనా కౌశలానికి యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అలానే పలువురు విమర్శకులు సైతం మూవీపై, విజయ్ నటన పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఆపై వరుస సినిమాలతో ప్రస్తుతం దూసుకెళ్తున్నారు.

ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో ఆ సినిమాకు సీక్వెల్ గా అర్జున్ రెడ్డి పార్ట్ 2 రానుందని టాక్. ఇప్పటికే ఆ మూవీ స్టోరీ ని మొదటి భాగాన్ని మించేలా పక్కాగా రెడీ చేసిన సందీప్ రెడ్డి ఇటీవల విజయ్ అని ప్రత్యేకంగా ఆయన నివాసంలో కలిసి వినిపించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం తాను ఒప్పుకున్న కమిట్ మెంట్స్ పూర్తవడానికి మరికొంత సమయం పడుతుందని అవి కంప్లీట్ అయిన వెంటనే మన సినిమాను పట్టాలెక్కిద్దామని విజయ్ మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. కాగా టాలీవుడ్ కు చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుందని అతి త్వరలో దీనికి సంబంధించిన అధికారిక వివరాలు కూడా బయటకు రానున్నాయని అంటున్నారు. మరోవైపు రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి అది పూర్తయిన అనంతరం ఈ మూవీ గురించి ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తారని అంటున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: