ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమా అత్యద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని అలరిస్తూ ప్రస్తుతం దుమ్ము రేపుతూ కొనసాగుతోంది.

బి,సి ఆడియన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారని అలానే చాలా ఏరియాల్లో ఏ సెక్షన్ ఆడియన్స్ కూడా తమ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారని యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా హీరో రవితేజ సహా యూనిట్ సభ్యులు అందరూ ప్రేక్షకాభిమానులకు తమకు ఇంత భారీ సక్సెస్ అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి గతంలో రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు రెండూ కూడా మంచి సక్సెస్ సాధించి వారి కాంబినేషన్ కి బాగా క్రేజ్ తెచ్చి పెట్టాయి. ఇక వారి మూడో కాంబినేషన్ లో తెరకెక్కిన క్రాక్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ నమోదు అయింది.

దీంతో ఒక్కసారిగా మంచి పేరు దక్కించుకున్న గోపీచంద్ కి ప్రస్తుతం పలువురు బడా హీరోల నుంచి పిలుపు వస్తున్నట్లు సమాచారం. ఇటీవల టాలీవుడ్ కు చెందిన టాప్ స్టార్ హీరో ఒకరు, మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ స్టోరీని సిద్ధం చేయమని గోపీచంద్ ని కోరారని అన్నీ సెట్ అయితే ఆ మూవీ ని వీలైనంత త్వరగా ప్రారంభిద్దామని అడిగినట్లు సమాచారం. మరోవైపు పలువురు ఇతర భాషల హీరోలు కూడా గోపీచంద్ తో సినిమాలు చేయడానికి సిద్ధపడుతున్నట్లు టాక్. మొత్తంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన క్రాక్ సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్ ఒక్కసారిగా గోపీచంద్ మలినేని ఫేట్ ని మార్చేసినట్లు చెబుతున్నారు విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: