తమిళనాడులో థళపతి విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీ తర్వాత ఆ రెంజ్ లో  ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా విజయ్ నిలిచాడు. తమిళనాడులో విజయ్ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం థలపతి ఇతర భాషల పై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. తన తాజా చిత్రం "మాస్టర్" సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో జనవరి 13న రిలీజ్ అయింది.

 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచి కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. సినిమా టీజర్ తోనే ఇండియా వైడ్ గా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే  సినిమా విడుదల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో డివైడ్ టాక్ ను తెచ్చుకుంది. అయినప్పటికీ సినిమా పై భారీ హైప్ ఉండడంవల్ల మంచి ఓపెనింగ్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తో కూడా మంచి వసూళ్లను అందుకుందని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. కరోనా నిబంధనలతో 50 % ఆక్యుపెన్సీకి మాత్రమే పరిమితమైన సిట్టింగ్ తో ఇలాంటి వసూళ్లు రాబట్టుకోవడం పట్ల ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

అంతేేకకుండా ఈ సినిమాతో పాటుగా మూడు క్రేజీ సినిమాలు కూడా పోటీలో ఉన్నప్పటికీ దిమ్మతిరిగే కలెక్షన్స్ సాధించడం విశేషమని చెప్పుకోవాలి. విజయ్ కి తుపాకి సినిమా ద్వారా తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు అనువాదం చేసినప్పటికీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. మళ్లీ ఇప్పుడు మాస్టర్ సినిమాతో తెలుగులో సాలిడ్ కలెక్షన్లు సాధిస్తున్నాడు.  దీన్ని బట్టి చూస్తే విజయ్ ఫాలోయింగ్ తెలుగులో కూడా పెరిగినట్టే కనిపిస్తుంది. మరి విజయ్ తన తర్వాతి సినిమాలను బైలింగ్వల్ ప్రాజెక్టులుగా తెరకెక్కిస్తాడెమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: