నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సాయేశా సైగల్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. థమన్ సంగీతం అందిస్తుండగా  ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  ఈ సినిమా కు ముందు బాలకృష్ణ దాదాపు అరడజను సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. దీంతో ఈ సినిమా పై అయన హోప్స్ పెట్టుకున్నారు. అటు బోయపాటి రికార్డు కూడా ఏమంత బాగాలేదు. అయన చేసిన వినయ విధేయ రామ ఫ్లాప్ తో అయన డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది..

సినిమా హిట్ తో మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తున్నాడు.. ఇకపోతే BB3   చిత్రం నుంచి వచ్చిన టీజర్ కు ప్రేక్షకులనుండి మంచి స్పందన వచ్చింది. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం.బాలయ్య అభిమానులకు డైరెక్టర్ బోయపాటి పై ఎనలేని నమ్మకంతో పాటు ప్రత్యేక అభిమానం కూడా ఉంది. ఎందుకంటే వేరే హీరోలను ఎలా చూపించినా బాలయ్యను మాత్రం ఓ రేంజ్ లో చూపిస్తాడని అంటున్నారు.

బోయపాటి కాంబోలో.. బాలయ్య నడక.. మాట.. డైలాగ్స్.. యాక్షన్ అన్నింట్లో హైడోస్ ఉంటుంది. ఇక బిబి3 అని ప్రచారంలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ఉగాది పండుగ సందర్బంగా విడుదల చేయాలనీ బాలయ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్నీ దర్శకనిర్మాతలతో కూడా చర్చించాడట. ఎందుకంటే బాలయ్యకు సంప్రదాయం ముహుర్తాల సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు పండుగలకు దేవుళ్ళకు మిస్ అవ్వకుండా పూజలు శుభాకార్యాలు చేస్తుంటారు బాలయ్య. అందుకే రాబోయే తెలుగు పండుగ ఉగాది కాబట్టి ఆ రోజే సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని భావించి.. ఉగాది పండుగ లోపు సినిమా కంప్లీట్ చేయాలనీ టీమ్ ను ఆదేశించాడని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి బాలయ్య బోయపాటిలు ఉగాదికి ట్రీట్ ఇస్తారేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: