రీ ఎంట్రీ లో మెగా స్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు సాటిగా వరుస సినిమాలు చేస్తున్నాడు.. అయితే ఇందులో ఎక్కువగా రీమేక్ సినిమాలు ఉండడం విశేషం.. ఇప్పటికే ఖైదీ నెంబర్ 150 రీమేక్ సినిమాను చేసిన చిరు త్వరలో లూసిఫర్, వేదాలం రీమేక్ లను కూడా ప్రారంభించబోతున్నారు. లూసిఫర్ సినిమా కి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం అందిస్తుండగా వేదాలం  రీమేక్ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు..

ఈనేపథ్యంలో ఈ రెండు సినిమాలను ఒకేసారి తెరకెక్కిచాలని చిరు ప్లాన్ చేసుకున్నాడట.. ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న చిరంజీవిసినిమా పూర్తి కాగానే రెండు సినిమాలను ఒకే సారి సెట్స్ మీదకు తీసుకెళ్లి ఒకేసారి పూర్తి చేయాలనుకుంటున్నాడట.. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై రామ్ చరణ్ - ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాలని నిర్మించనున్నారట. 'లూసిఫర్' రీమేక్ ని జనవరి 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం. వేదళమ్' తెలుగు రీమేక్ ని ఫిబ్రవరిలో పట్టాలెక్కించి.. 'లూసిఫర్'తో పాటు ప్యారలల్ గా చిత్రీకరణ చేయాలని ఆలోచిస్తున్నారట.

ఇకపోతే ఆచార్య సినిమా చివరి దశ షూటింగ్ కి వచ్చేసింది.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా ని సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.  రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తుండగా దాదాపు గంట సేపు ఈ చిత్రంలో చరణ్ కనిపించబోతున్నాడట.. ఇటీవలే సిద్ధ పాత్ర లో నటిస్తున్న రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసి సినిమాపై హైప్ ని పెంచారు.  ఈ సినిమా లో చరణ్ జోడి గురించి ముందునుంచి టీం లో చిన్న అయోమయం నెలకొందని తెలుస్తుంది. ఇప్పటికే  మెగాస్టార్ కు ఆపోజిట్ లో ఫీమేల్ లీడ్ లో కాజల్ అగర్వాల్ ను ఓకే చెయ్యడం ఆమె ఆల్రెడీ ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకొని వెళ్లిపోవడం వంటివి కూడా జరిగాయి. కానీ చరణ్ కు ఫిమేల్ లీడ్ లో ఎవరు నటిస్తున్నారు అన్న దానిపై మాత్రం ఇంకా సరైన క్లారిటీ ఇప్పుడప్పుడే వచ్చేలా లేదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: