సినిమా రంగంలో ఎవ‌రెన్ని మాట‌లు చెప్పినా.. గొప్ప‌లు పోయినా అంతిమంగా మాట్లాడేది హిట్టు మాత్ర‌మే. ఒకే ఒక్క హిట్టు పాతాళంలో ఉన్న వాళ్ల‌ను కూడా తీసుకు వెళ్లి పైన కూర్చో పెడుతుంది. ఆ ఒక్క హిట్టుతో చిన్నోళ్లు సైతం రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతారు.. అదే ఒక్క ప్లాప్ ప‌డితే శిఖ‌రం మీద ఉన్న‌వాళ్లు సైతం భూమ్మీద‌కు వ‌చ్చేస్తారు. ఇండస్ట్రీలో విజ‌యం, ప‌రాజ‌యం మ‌ధ్య ఉన్న చిన్న గీతే వాళ్ల స్థాయిని.. పొజిష‌న్‌ను నిర్ణ‌యిస్తుంది. ఇక సంతోష్ శ్రీనివాస్ అనే ద‌ర్శ‌కుడు టాలీవుడ్‌లో కందిరీగ సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాక ఎంతో మంది సంతోష్‌తో సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు.

పెద్ద హీరోలు సైతం సంతోష్‌ను పిలిపించుకుని క‌థ రెడీ చేయ‌మ‌ని చెప్పారు. ఏకంగా ఎన్టీఆర్‌ను బుట్ట‌లో వేయ‌గా ర‌భ‌స‌తో ఛాన్స్ ఇచ్చాడు. ఆ ర‌భ‌స‌తో నానా ర‌చ్చ ర‌చ్చ చేయ‌గా.. ఆ సినిమా దెబ్బ‌కు ఎన్టీఆర్ ఎక్క‌డో ఉండాల్సినోడు.. ఎక్క‌డికో ప‌డిపోయాడు. ఆ సినిమా రిజ‌ల్ట్ చూసిన పెద్ద హీరోలు సంతోష్ అంటేనే భ‌య‌ప‌డిపోయే ప‌రిస్థితి. కొన్నేళ్లు ఖాళీగానే ఉన్నాడు. మ‌ళ్లీ రామ్ హైప‌ర్‌తో మంచి ఛాన్స్ ఇచ్చినా పెద్ద‌గా నిల‌బెట్టుకోలేదు. హైప‌ర్ మంచి క‌థ ఉన్నా ద‌ర్శ‌కుడిగా తెర‌మీద స‌రిగా ప్ర‌జెంట్ చేయ‌లేదు.

ఇక ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌ను బ‌తిమిలాడుకుని ఏదోలా అల్లుడు అదుర్స్ సినిమా ఛాన్స్ కొట్టేశాడు. ఇది ఘోర‌మైన డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు మంచి బ‌జ్ రావ‌డంతో సంతోష్ శ్రీనివాస్ బాల‌య్య‌పైనే గురి పెట్టాడు. తాను బాల‌య్య‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాన‌ని.. లాక్ డౌన్ స‌మ‌యంలో.. బాల‌య్య కోసం ఓ క‌థ సిద్ధం చేసుకున్నాడు సంతోష్‌. `బ‌ల‌రామ‌య్య బ‌రిలోకి దిగితే` అనే టైటిల్ కూడా పెట్టాన‌ని చెప్పాడు.

ఈ రిజ‌ల్ట్ చూశాక బాల‌య్యే కాదు.. ఏ హీరో కూడా సంతోష్‌కు అపాయింట్ మెంట్ కూడా ఇచ్చే ప‌రిస్థితి లేదు. అంత చెత్త సినిమాను సంతోష్ సంక్రాంతికి వ‌దిలాడు. మ‌ళ్లీ మ‌నోడు ఎన్నేళ్లు ఖాళీగా ఉండాలో ? 

మరింత సమాచారం తెలుసుకోండి: