సినిమా అన్నది తెర ముందు వినోదం, రియాలిటీని రీల్ మీదకు ఎక్కించే సాహసం. మూడు గంటల సినిమా మూడు దశల  జీవితాన్ని అక్కడ ప్రతిబింబిస్తుంది. అటువంటి తెర బొమ్మలకే కష్టాలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. ఒక క్యాలండర్ ఇయర్ ని కరోనా తినేస్తుంది అని కలలో కూడా ఎవరూ  ఊహించలేదు.

దాంతో లావిష్ గా సినిమాకు ఖర్చు చేసి తీసే టాలీవుడ్  బడా నిర్మాతలు నిండా మునిగిపోయారు. కరోనా ఇంకా ఉంది. అదే సమయంలో భయాలు మాత్రం గతంలోలా మాదిరిగా లేవు. మరో వైపు చూస్తే కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది.

ఇక ఇంకో వైపు చూసుకుంటే సినిమా థియేటర్లకు అనుమతులు ఇచ్చారు అయితే ఫిఫ్టీ పెర్సెంట్  ఆక్యుపెన్సీ మాత్రమే అనుమతించారు. దాంతో సినిమాలు మెల్లగా రిలీజ్ అవుతున్నాయి. ఇపుడు వస్తున్న సినిమాలు అయితే మిడిల్ రేంజి హీరోలవే కావడం విశేషం. సెంట్ పర్సెంట్ ఆక్యుపెన్సీ కి అనుమతి ఇస్తేనే తప్ప పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే సీన్ లేదు.

ఇక గత డిసెంబర్ 25 న మెగా మేనల్లుడు సాయి రేజ్ నటించిన సోలో బతుకే సో బెటర్ మూవీ రిలీజ్ అయి హిట్ అయింది. ఇక సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాలు కూడా వసూళ్ళ పరంగా బెటర్ అనిపించుకున్నాయి. అయితే అసలు డౌట్లు అలాగే ఉన్నాయి. అవేంటి అంటే పెద్ద సినిమాలు, వందల కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలు, వీటికి నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీ ఉంటేనే తప్ప గిట్టు బాటు కాదు.

మరి సమ్మర్  కైనా సెంట్ పెర్సెంట్ సీట్లకు అనుమతులు వస్తాయా అన్నది ఒక చర్చగా ఉంది. కరోనా కనుక ఇంకా బాగా తగ్గితే మాత్రం కచ్చితంగా అనుమతులు ఇస్తారని అంటున్నారు.  ఒకవేళ ఏదైనా కారణాల వల్ల లేట్ అయితే అప్పటిదాకా పెద్ద సినిమాలు రిలీజ్ కావు అన్నది ష్యూర్ గా  చెప్పేయవచ్చు. మొత్తానికి సమ్మర్ కి బొమ్మ పడాలంటే  థియేటర్లకు పూర్తి ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: