మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి కాంబినేషన్ లో బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమాకు టైటిల్ గా గని అని ఫిక్స్ చేశారు. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. గద్దలకొండ గణెష్, ఎఫ్2 సినిమాల హిట్ తో సూపర్ ఫాం లో ఉన్న వరుణ్ తేజ్ గనితో బాక్సాఫీస్ పై సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ మోషన్ పోస్టర్ లో వరుణ్ తేజ్ పవర్ ప్యాక్ లుక్ అదిరిపోయింది.

ముందు ఈ సినిమాకు బాక్సర్ అని టైటిల్ పెట్టాలని అనుకున్నారట. కాని ఎందుకో చిత్రయూనిట్ గనికి ఫిక్స్ అయ్యింది. వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సిద్ధు, బాబీ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మెగా హీరోల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న వరుణ్ తేజ్ గనితో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

వరుణ్ తేజ్ గని కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుందని చెప్పొచ్చు. సినిమా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న కమర్షియల్ సినిమాకు కావల్సిన అన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి వరుణ్ తేజ్ గని సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మోషన్ పోస్టర్ మాత్రం సినిమా మీద అంచనాలు పెంచేసింది.  గని ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మెగా పవర్ స్టార్ రాం చరణ్ రిలీజ్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: