మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి అర్ధంకాని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది రాంగోపాల్ వర్మ అని చెప్పొచ్చు..బహుశా ఈ భూమ్మీద ఇలాంటి మనిషి ఈయనొక్కడే అనుకుంటా..అసలు ఆర్జీవీ ఏం మాట్లాడతాడో..ఆ మాటల వెనుక ఉన్న అర్ధం, పరమార్ధం ఏమిటో తెలుసుకోవడానికి..కాస్త టైం పట్టుద్ది.. అందుకే ఆర్జీవీ గురించి మాట్లాడటానికి మనకి మాటలు సరిపోవు..అయన గురించి రాద్దామంటే పుస్తకాలు సరిపోవు..అంతలా ఆయన మాటలు, ఆయన ఆటిట్యూడ్ అందరిని ఆలోచింపజేస్తుంది.

అయితే ఆర్జీవీ ఇప్పటివరకు కొన్ని వందల ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు..ముఖ్యంగా లేడీ యాంకర్స్ ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి ఎగబడుతూ ఉంటారు..ఎందుకంటే ఆయనకు అనిపించింది, చెప్పాలనిపించింది ముక్కు సూటిగా చెప్పేస్తాడు కాబట్టి వాటితోపాటు కొన్ని ఇంటర్వ్యూలలో ఆ లేడీ యాంకర్ అర్జీవికి నచ్చితే ఆమెతో పులిహోర కూడా కలుపుతూ ఉంటాడు. దాన్ని చూసే ప్రేక్షకులు, ఇంటర్వ్యూ చేసే అమ్మాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇటీవలే ఆర్జీవీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసాడు ఆర్జీవీ. ఆర్జీవీ గారి గురించి మనందరికి తెలిసిందే కదా..ఆయనకు ఇష్టం వచ్చినట్టు బతుకుతానని ప్రతిసారి చెప్తూ ఉంటారు. సో, ఆర్జీవీ తన భార్యతో కలిసి ఉండేటప్పుడు జరిగిన ఒక విషయం గురించి చెప్పాడు. ఆర్జీవికి ఇళయరాజా గారి సంగీతం అంటే చాలా ఇష్టమట..సో, ఆయన క్యాసెట్స్ తెచ్చుకొని రోజు ఇంట్లో ఆ పాటలు వింటూ ఉండేవారట..కానీ వాళ్ళ వైఫ్ కి మాత్రం గజల్స్ అంటే ఇష్టమట..అయితే ఆర్జీవీ ఆమెకిష్టమొచ్చిన పాటలు పెట్టరు కాబట్టి ఆయనమీద కోపంతో ఒకరోజు ఇళయరాజా క్యాసెట్స్ మొత్తం ఇరగ్గొట్టేసిందట..

బట్ ఆర్జీవీకి సామాన్యంగా కోపం రాదు కాబట్టి వాళ్ళ వైఫ్ ని ఏమనకుండా మళ్ళీ కొత్త క్యాసెట్స్ కొనుక్కొని పక్కింటికి వెళ్లి వినడం మొదలెట్టారట..దానికి మళ్ళీ కోపంతో వాళ్ళావిడా ఊగిపోయేవారట. తెచ్చిన అన్ని క్యాసెట్లను విరగొట్టేవారట..అలా తన వైఫ్ తో జరిగిన కొన్ని సందర్భాలను ప్రేక్షకులతో పంచుకున్నారు ఆర్జీవీ. అయితే ఫైనల్ గా ఆర్జీవీ చెప్పొచ్చేది ఏంటంటే..తనని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు..ఆయన ఎవర్నీ డిస్టర్బ్ చేయడు..అది భార్య అయినా ఎవరైనా..అలా అయితే ఎవరికీ ఏ బాధ ఉండదని ఆయన నమ్మకం..కానీ ఈరోజుల్లో ఎవరు అలా ఉండలేరు..

మరింత సమాచారం తెలుసుకోండి: