గతేడాది సినిమాలకు దూరంగా ఉన్న చిరు వరుస సినిమాలకు ఓకే చెప్తూ ఫుల్ బిజీగా మారారు. ప్రస్తుతం ఈ హీరో ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కాగా  ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే మరో సినిమా గురించి ప్లాన్స్ మొదలుపెట్టాడు చిరంజీవి. ఆచార్య తర్వాత తెరకెక్కించే లూసీఫర్ సినిమా ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిరు ఉత్సాహంగా ఉన్నారు. కాగా  ఈ రీమేక్ సినిమాకు సంబంధించిన కొన్ని క్యారెక్టర్ల విషయం లో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకి సిస్టర్ గా నటిస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ అందులో తన పాత్రకు ప్రాధాన్యత లేదని నయన్ అంగీకరించలేదనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అలాంటి భామ ఇప్పుడు సిస్టర్ రోల్ కి ఓకే చెప్పిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరుకోసమే ఈ బ్యూటీ రిస్క్ చేస్తోందట మరి. కానీ ఈ బ్యూటీకి ఇలాంటి చిన్న పాత్రలో నటించే అవసరమే లేదు. తాను నటించాలనుకుంటుందంటే చాలు నయన్ తో లేడీ ఓరియెంటెడ్ స్టోరీని సిద్ధం చేసే డైరెక్టర్స్ చాలా మందే ఉన్నారు. కానీ నయన్ కేవలం ఇందులో నటించడానికి కారణం రిలేషన్ షిప్పే కారణమని భావిస్తున్నారు ఆమె అభిమానులు.

 ఇంతకు మునుపు కూడా నయనతార చిరంజీవికి జోడీగా సైరా నరసింహరెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ స్టార్ సినిమాలో నటించే అవకాశాలన్ని పోగొట్టుకోలేక ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇంత ఇమేజ్ ఇన్న నయన్ చిన్న రోల్ లో నటిస్తే ఆమె అభిమానులు అంగీకరీస్తారో లేదో చూడాలి మరి..  ప్రస్తుతం నయనతార తమిళంలో విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమాల్లో నటిస్తోంది. తొందరలోనే లూసీఫర్ రీమేక్  సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ గా కనిపించడానికి సిద్ధమవుతోంది నయనతార. 

మరింత సమాచారం తెలుసుకోండి: