కొంత మంది అందాల భామలు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ప్రచారం కోసం ఆరాట పడుతూ ఉంటారు. "ఒక్క చాన్స్ .... ఒకే ఒక చాన్స్" అంటూ ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని సమయాల్లో "బోల్డ్ కామెంట్స్ చేసైనా సరే లైం-లైట్ లోకి వచ్చి ఎవరైనా నిర్మాత దర్శకుల, కథానాయకుల దృష్టిలో పడాలని ప్రయత్నిస్తుంటారు"

అలా ప్రయత్నిస్తున్న భామ ఒక బోల్డ్ కామెంట్ చేసింది. ఈ భామ గతంలో, వి.ఎన్‌. ఆదిత్య డైరెక్ట్ చేసిన  “రెయిన్‌ బో” సినిమాతో టాలీవుడ్ ‌లోకి అడుగుపెట్టి మరో సినిమా కోసం నిరీక్షిస్తున్న వేళ మన బాలయ్య బాబు దృష్టిలో పడటం చకచకా కొన్ని అవకాశాలు వచ్చాయి ఈ బ్యూటిఫుల్ భామకు. ఆ భామే సొనాల్ చౌహన్ సోనాల్ చౌహాన్‌. ఆమెకు ఒక గుర్తింపు పేరు తెచ్చింది మాత్రం బాల‌కృష్ణ ‌తో చేసిన సినిమాలే.

బాల‌య్య‌తో ఆమె లెజెండ్‌, డిక్టేట‌ర్‌, రూల‌ర్ సినిమాల్లో న‌టించింది. ఆయ‌న‌తో వంద సినిమాల్లో న‌టించాల‌ని ఉంద‌ని అప్ప‌ట్లో ఆమె చేసిన కామెంట్ వైర‌ల్ అయ్యింది. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూతో అలాంటి సంచ‌ల‌న‌మే సృష్టించింది సోనాల్‌ చౌహాన్‌.  సోష‌ల్ మీడియాలో యాక్టివ్ ‌గా ఉండే ఈ భామ త‌ర‌చూ త‌న గ్లామ‌ర్ పిక్చ‌ర్స్‌ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ ను హుషారుగా ఎంటర్టైన్ చేస్తూ వుంటుంది.

తాజా ఇంట‌ర్వ్యూ లో “త‌న‌కు ఒక‌సారి కాకుండా రెండు సార్లు పెళ్లిచేసుకోవాల‌ని ఉంద‌ని”  చెప్పి అంద‌ర్నీ షాక్ ‌కు గురిచేసింది. "నాకు ప్ర‌కృతి అంటే చాలా ఇష్టం. కాబ‌ట్టి నేను రెండుసార్లు పెళ్లాడాల‌ని అనుకుంటున్నాను" అని ఆమె ఆ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

ఇప్పుడు ప్ర‌కృతికి, సోనాల్ రెండు పెళ్లిళ్ల‌కు సంబంధ‌మేంట‌ని ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌ కుండా ఉండ‌దు కదా! “ఒక‌సారి బీచ్ ద‌గ్గ‌ర‌, ఇంకో సారి ఎత్తైన కొండ ‌మీదా” పెళ్లి చేసు కోవాల‌ని త‌న కోరిక అంటూ తెలిపింది సోనాల్‌.

పెళ్లి గురించి ఇలాంటి కోరిక త‌న‌లో ఉంచుకుంది కాబ‌ట్టి, ఇప్ప‌టికే ఆమె స‌రైన వ్య‌క్తిని ఆమె ఎంచుకొని ఉంటుంద‌ని ఎవ‌రైనా అనుకోవ‌చ్చు. దానికి కూడా క్లారిటీ ఇచ్చిందామె. "నా లైఫ్‌లో ఇప్పుడు ఎవ‌రూ లేదు నేను సింగిల్" అని చెప్పకనే చెప్పింది. అంటే ఇష్టపడే వాళ్ళకు వెల్కం అనేగా అర్ధం! ట్రై & టెష్ట్ యువర్ లక్.
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: