అమెజాన్ ప్రైమ్ వీడియో తన స్పెషల్ కంటెంట్ తో చాలా మందిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మీర్జాపూర్ లాంటి బోల్డ్ డైలాగ్స్ ఉన్న కంటెంట్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తోంది. ఇక మీర్జాపూర్ యువతలో క్రేజ్ తెచ్చుకోవడంతో అది మంచి హిట్ అయ్యింది. మిర్జాపూర్ సీజన్ 2 కూడా అమెజాన్ ప్రైమ్‌ లో రిలీజ్ అయింది. అయితే అప్పటి నుండే అనేక వివాదాలు ఈ సిరీస్ ని చుట్టుముట్టాయి. ‘మిర్జాపూర్’ అనే పేరును ఉపయోగించడం మొదలు మున్నా పాత్ర ప్రేరణతో తనను ప్రేమించని వ్యక్తిని చంపడం వరకు, ఇలా అనేక వివాదాలతో ఈ సిరీస్ ఫేమస్ అయింది. 

తాజాగా అందుతున్న సమాచారం మేరకు మేకర్స్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. యుపి పౌరులను నేరస్థులుగా చిత్రీకరించినందుకు ఇప్పటికే లక్నో కోర్టులో కేసు నమోదు చేసిన అనంతరం మీర్జాపూర్ మేకర్స్ మరొక చట్ట పరమైన వివాదంలో చిక్కుకున్నారు.  రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్, మరియు భౌమిక్ గొండాలియాపై మిర్జాపూర్ ప్రాంతాన్ని ఒక ప్రమాదకర ప్రాంతంలా చూపించినందుకు గాను మీర్జాపూర్ ప్రాంతంలోని కొత్వాలి దేహాట్ పోలీసు ప్రధాన కార్యాలయంలో ఒక కేసు నమోదయింది. 


తమ ప్రాంతాన్ని ఒక క్రిమినల్ జోన్ గా క్రియేట్ చేయడం ద్వారా సామాజిక విద్వేషాన్ని రేకెత్తిస్తున్నారని దావా వేశారు. ఈ వెబ్ సిరీస్ తమ మత మనోభావాలను దెబ్బతీసిందని అరవింద్ చతుర్వేది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐపిసి సెక్షన్లు 295 ఎ. 505 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. చూడాలి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: