సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు జిమ్ తో తెగ కుస్తీలు పడుతుండటం సహజం. ఒంటిని బలంగా, సన్నజాజిలా చేసి ఫిట్ గా ఉండటానికి గంటలు తరబడి జిమ్ లో గడిపేస్తుంటారు. అందులో కూడా రకుల్ ఫిజిక్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాదనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే ఈ  బ్యూటీ ఎంత పనిలో ఉన్నా 4 గంటలైనా జిమ్ లో గడిపేస్తుందట. జిమ్ లో గడవని రోజు రోజులాగే ఉండదట ఈ ఢిల్లీ బ్యూటీకి. అందుకోసమే తరచూ జిమ్ లో వర్కౌట్లు చేస్తూ చెమట చిందిస్తోంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కు సొంతంగా కూడా జిమ్ లు ఉన్నాయట.
 ఈ బ్యూటీ ఒకవైపు సినిమాల్లో భారీగానే సంపాదిస్తూనే మరోవైపు జిమ్ సెంటర్ల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తోంది. తన జిమ్ లో కూడా ఈ చిన్నది వర్కౌట్లు చేస్తుంటారు అప్పుడప్పుడు.  ఆ వర్కౌట్లకు సంబంధించిన వీడియోలను కూడా అప్పుడప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటారు. కాగా ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింత్ తాజాగా తన వర్కౌట్లు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. ఆ వీడియోలో ఈ చిన్నది అప్ అండ్ డౌన్ స్వ్కాట్స్ చేస్తూ కనిపించారు. దీనితో పాటుగా రకుల్ ఈ వీడియోకు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ను కూడా జత చేశారు.  

‘జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు ఉంటాయి. వాటినే నేను స్వ్కాట్స్ అని పిలుస్తానని కామెంట్ చేసింది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అలాగే బర్న్, స్ట్రాంగ్ ఈజ్ ద న్యూ సెక్సీ, ఫిట్ నెస్ ఎంథూజియాస్ట్ అనే హ్యాష్ ట్యాగ్ లు కూడా పెట్టేసింది. జిమ్ లో ఈ  చిన్నది చెబుతున్న జీవిత సత్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.  ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నితిన్ చెక్ సినిమాలో నటిస్తోంది. దీనితో పాటుగా తమిళ్ లో కమల్ హాజన్ ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తోంది. వీటితో పాటుగా బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: