బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ తనకు లేటెస్ట్ గా వచ్చిన క్రేజ్ ను బాగా సద్వినియోగపరచుకుంటోంది. ఐటెం సాంగ్స్ కు కూడా సిద్ధమేనంటూ "అల్లుడు అదుర్స్" ద్వారా హింట్ ఇచ్చింది. బెల్లంకొండ అలాగే సోనూ సూద్ తో స్టెప్పులేసి ఆడియెన్స్ ను అలరించింది. అలాగే 'డాన్స్ ప్లస్' షోలో జడ్జ్ గా ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తోంది. "ఇచ్చిపడేశారు" అన్న డైలాగ్ ను ముద్దుముద్దుగా పలుకుతూ బుల్లితెరలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మోనాల్ ను హీరోయిన్ గా కూడా చూడాలని ఆడియెన్స్ ఆశిస్తున్నారు.

సీనియర్ హీరోస్ కు మోనాల్ భలే సూట్ అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి, హౌస్ లో చీటికీ మాటికీ ఎమోషనల్ గా మారి టిష్యూ పేపర్స్ ను ఓ రేంజ్ లో వాడేసిన మోనాల్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. తన కెరీర్ కు సెకండ్ ఇన్నింగ్స్ బాగా స్టార్టయిందని సంతోషపడుతోంది. తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పాలని కూడా ఈ భామ డిసైడయింది. నటీనటులకు పరిపూర్ణత అనేది తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పడం వలన కలుగుతుందని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే, మోనాల్ బిగ్ బాస్ హౌస్ లోని అభిజిత్ అలాగే హారిక ఫ్రెండ్ షిప్ గురించి తనదైన శైలి విశ్లేషణతో ఆడియెన్స్ కు షాకిచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ అలాగే హారిక ఫ్రెండ్షిప్ అనేది ప్రేక్షకులను అలరించింది. వీరిద్దరి కాంబినేషన్ కు "అభిక" అని పేరు పెట్టుకున్నారు అభిమానులు. ఐతే, అభిజిత్ బయటికి వచ్చాక 'హారిక నాకు సిస్టర్ లాంటిది" అని చెప్పి అభిమానులకు షాకిచ్చాడు.

ఇదే విషయం గురించి మోనాల్ ను అడగగా హారిక అలాగే అభిజిత్ మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది తనకెప్పుడూ కనిపించలేదని చెప్పుకొచ్చింది. నిజానికి, హారికకు అభిజిత్ అంటే ఇష్టమన్న విషయాన్ని తానే అభిజిత్ కు ఒకానొక సమయంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంది. ఒక అమ్మాయిగా ఇంకొక అమ్మాయిలోని ఫీలింగ్స్ ను తాను ఇట్టే అర్థం చేసుకోగలనని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై అభిజిత్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: