మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో విశ్వవిజేతగా ఎదిగాడు. 150 చిత్రాలకు పైగా సినిమాల ప్రస్థానాన్ని సాధించి,ప్రస్తుతం ఆచార్యతో అలాగే కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. 60 సంవత్సరాలు పైబడినప్పటికి కూడా వృద్ధాప్య ఛాయలను కూడా దాటుకుంటూ, నిత్యయవ్వనంగా ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నాడు మెగాస్టార్.


మెగాస్టార్ చిరంజీవిని అందుకోవడం ఎవరి తరం కాదు. ఆయన స్థానాన్ని సంపాదించుకోవాలంటే ప్రస్తుతం ఉన్న హీరోలకు అడపాదడపా ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. అంత గొప్ప స్థానం మెగాస్టార్ చిరంజీవిది. అందుకే చిరంజీవిని మెగాస్టార్ గా అందరూ సంబోధిస్తారు. ఇలాంటి గొప్ప  గణ విజేతగా నిలిచిన మెగాస్టార్ కేవలం ఒకే ఒక సినిమాలో హీరోగా ఛాన్స్ రాలేదని కన్నీరు పెట్టుకున్నారట. మూడు రోజుల పాటు చాలా దిగ్భ్రాంతికి గురయ్యాడు. అయితే ఏ సినిమా కోసం చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారో? ఆ సినిమా వివరాలేంటో?ఇప్పుడు చూద్దాం.

1986లో స్వాతిముత్యం విడుదలై  బ్రహ్మాండమైన ప్రేక్షకాదరణ పొందింది.కమర్షియల్ సినిమాకు దీటుగా చాలా కేంద్రాల్లో వంద రోజులకు పైగా ఆడింది ఈ చిత్రం. ఈ సినిమా విడుదలైన రోజుల్లో కమలహాసన్ గురించి మాట్లాడుకోని ప్రేక్షకులంటూ ఎవరూ లేరు. అదే విషయాన్ని విన్న చిరంజీవి కూడా స్వాతిముత్యంను ప్రత్యేకంగా చూశారట. అంతే ఇక  ఆ సినిమా చూసిన వెంటనే మూడ్ ఆఫ్ అయ్యారు. "సుప్రీం హీరో, మెగాస్టార్ అని పిలిపించుకున్న నాకేం తక్కువ అని అనుకుంటున్న రోజుల్లో ఒక్కసారిగా స్వాతిముత్యం సినిమాను చూసి నేను ఏం కోల్పోయానో నాకు అర్థం అయింది.ఇలాంటి పాత్ర నాకు ఎందుకు రాలేదు? ఇంత గొప్పగా పని చేసే సబ్జెక్టు నాకు దొరుకుతుందా? అని ఎన్నోసార్లు నాలో నేనే మదన పడ్డాను"అంటూ ఒక సోషల్ మీడియా వేదికగా ఆయన చెప్పుకొచ్చారు.

ఇక అదే సమయంలో చిరు తోపాటు షూటింగ్ లో ఉన్న హీరోయిన్ సుహాసిని కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. మీరు కూడా గొప్ప నటులే.కానీ టైం వచ్చినప్పుడు ప్రతి ఆర్టిస్ట్,తన టాలెంట్ను  బయట పెట్టుకునే సమయం వస్తుంది.అని చెప్పి ఆ విషయాన్ని విశ్వనాథ్ తో పాటు కమల్హాసన్కి కూడా చేరవేసిందట. ఇక మెగా స్టార్ చిరంజీవికి ఉన్న ఆ కోరిక విశ్వనాథం గారితో స్వయం కృషి చేసేలా చేసింది. ఇలా  తన కోరికను తీర్చుకున్నాడు  మెగాస్టార్. స్వయంకృషి లో మెగాస్టార్ చేసిన నటనకు నంది అవార్డు ఇచ్చినా తక్కువే.

మరింత సమాచారం తెలుసుకోండి: