మనలో చాలా మందికి  సినిమా విడుదలైన రోజే  థియేటర్ కి వెళ్లి సినిమా చూసే అలవాటు ఉంటుంది.  అయితే మరి కొంతమంది సినిమా థియేటర్ లకి వెళ్ళకుండా పైరసీలు చేయడం, లేదా ఇంటర్నెట్ లో వచ్చే వరకు వేచి ఉండడం వంటివి చేస్తుంటారు. మరికొంతమంది టీవీలో వచ్చే వరకు ఎదురుచూస్తుంటారు.  అయితే మనలో చాలామందికి మన ఫేవరెట్ స్టార్ సినిమా విడుదల అవుతుందంటే చాలు ఆ సినిమా హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా? ఎంత కలెక్షన్స్  సాధిస్తుంది? ఎన్ని రోజులు ఆడుతుంది? అనే విషయాన్ని ముందుగా చూస్తాం.

కానీ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సినిమాలు మాత్రం మళ్ళీ టీవీలో ఎప్పుడు వస్తాయా?అని ఎదురు చూస్తాం.ఇలా ఎదురు చూసే.. మనం వాటికి  అత్యధిక టిఆర్పి రేటింగ్  ను కట్టబడుతున్నాం. ప్రస్తుతం కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా థియేటర్లు మూతపడ్డాయి. ఇక చేసేదేమీ లేక అందరూ టీవీలకే పరిమితమయ్యారు. ఇలా ఈ కొద్దికాలంలోనే బుల్లితెరపై వచ్చిన ఎన్నో సినిమాలు అత్యధిక టీ.ఆర్.పీ  రేటింగ్ ను సాధించిపెట్టాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 రంగస్థలం:
 టీ.ఆర్.పీ రేటింగ్ - 19.5
 నటీనటులు - సమంత,రామ్ చరణ్, ఆది పినిశెట్టి
 దర్శకుడు - సుకుమార్.

మహానటి:
టీ.ఆర్.పీ రేటింగ్  - 20.2
నటీనటులు - కీర్తిసురేష్,దుల్కర్ సల్మాన్,సమంత, విజయ్ దేవరకొండ
దర్శకుడు  - నాగ్ అశ్విన్

అరవింద సమేత:
 టీ.ఆర్.పీ రేటింగ్  -20.69
 నటీనటులు  - ఎన్టీఆర్,పూజా హెగ్డే,ఈషా రెబ్బ
 దర్శకుడు  - త్రివిక్రమ్

గీతా గోవిందం:
టీ.ఆర్.పీ రేటింగ్  - 20.8
నటీనటులు  - రష్మిక,విజయ్ దేవరకొండ
దర్శకుడు  - పరశురామ్

 ఫిదా:
 టీ.ఆర్.పీ రేటింగ్  - 21.31
 నటీనటులు -వరుణ్ తేజ్,సాయి పల్లవి
 దర్శకుడు - శేఖర్ కమ్ముల

బాహుబలి:
టీ.ఆర్.పీ రేటింగ్ -21.5
నటీనటులు -  ప్రభాస్, రానా,అనుష్క,తమన్నా
దర్శకుడు  - రాజమౌళి


దువ్వాడ జగన్నాథం:
టీ.ఆర్.పీ రేటింగ్  - 21.7
నటీనటులు  - అల్లు అర్జున్, పూజ హెగ్డే, రావురమేష్
దర్శకుడు  - హరీష్ శంకర్

శ్రీమంతుడు:
టీ.ఆర్.పీ రేటింగ్  - 22.54
నటీనటులు  - మహేష్ బాబు,శృతిహాసన్,జగపతి బాబు
దర్శకుడు - కొరటాల శివ

బాహుబలి 2:
టీ.ఆర్.పీ రేటింగ్ -  22.7
నటీనటులు  - ప్రభాస్,రానా, అనుష్క, తమన్నా
దర్శకుడు -  రాజమౌళి

సరిలేరు నీకెవ్వరు:
టీ.ఆర్.పీ రేటింగ్ -  23.0 4
నటీనటులు- మహేష్ బాబు,రష్మిక, విజయశాంతి, రాజేంద్రప్రసాద్
దర్శకుడు  - అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: