మెగాబ్రదర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా పాల్గొంటూ ఉంటారు. తన కుటుంబ విషయాల నుంచి సామాజిక అంశాల వరకూ అన్నింటిపై చర్చిస్తూ ఉంటారు. అయితే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఈ రోజు తన 31వ జన్మదినాన్ని సెలబ్రేట్ చుసుకున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన కుటుంబ సభ్యులతో పాటుగా సినీ ప్రముఖుల నుంచి కూడా విషెస్ అందుకున్నాడు. అయితే కొడుకు పుట్టిన రోజు సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు వరుణ్ కు సోషల్ మీడియా వేదికగా  శుభాకాంక్షలు తెలిపారు. పాలబుగ్గరలతో ముద్దులొలికిస్తూ ఉన్న వరుణ్ చిన్ననాటి ఫోటోను షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.
అయితే నాగబాబు సోషల్ మీడియా వేధికగా పంచుకున్న ఆ ఫోటోలో వరుణ్ తో పాటుగా చిన్నారిగా ఉన్న నిహారిక, నాగబాబు అతని సతీమణి  కూడా ఉన్నారు. ఈ ఫోటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాలబుగ్గలతో ముద్దొస్తున్న వరుణ్ ఇప్పుడు ఆరడుగుల అందగాడిగా మారిపోయి సినిమాల్లో తన స్టైల్లో రాణిస్తున్నారు.  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో కథల ఎంపికలో కొంచెం తడబాటుకు గురైనా.. తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ మంచి విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం ఈ హీరో వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అయితే వరుణ్ తేజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతను నటిస్తున్న తాజా మూవీ నుంచి మోషన్ పోస్టర్, టైటిల్ ను రిలీజ్ చేసింది ఈ చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ లుక్ అదర్స్ అనిపిస్తోంది. ఈ  మూవీకి టైటిల్ ను ‘గని’ గా ఫిక్స్ చేసారు దర్శక నిర్మాతలు. ఈ మూవీలో వరుణ్ బాక్సర్ గా కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ గా కిరణ్ కొర్రపాటి వ్యవహరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: