జబర్దస్త్ లో పంచుల ప్రవాహం వచ్చే స్కిట్ ఏదైనా ఉంది అంటే అది హైపర్ ఆది స్కిట్ అన్నట్టే. జరిగిన జరుగుతున్న అంశాల గురించి కాన్సెప్ట్ అనుకుని ఆది చేసే స్కిట్స్ బాగుంటాయి. ఇక ఒకదానికిమించి ఒకటి అనేలా తన కామెడేఎ పంచులతో అలరిస్తాడు. హైపర్ ఆది, రైజింగ్ రాజు కలిసి చేసే కామెడీ పంచులకు ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.

అయితే జబర్దస్త్ లో ఉంటూనే అక్కడ వారి మీద ఆది పంచులు అప్పుడప్పుడు హైలెట్ గా ఉంటాయి. లేటెస్ట్ గా హైపర్ ఆది తన స్కిట్ లో ఇమ్మాన్యుయల్, వర్షల మీద వేసిన పంచ్ అదిరిపోయింది. ఈమధ్యనే జబర్దస్త్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఇమ్మాన్యుయెల్, వర్షలని టార్గెట్ చేశాడు ఆది. ఈమధ్య వారిద్దరు కలిసి చేస్తున్న స్కిట్స్ హిట్ అవడం.. ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అవడంతో ఇమ్మాన్యుయెల్ వర్షల మీద ఫోకస్ ఎక్కువైంది. అయితే బ్లాక్ అండ్ వైట్ కాంబోలా అనిపించే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టు సీన్ చూపించేస్తున్నారు జబర్దస్త్ టీం.

అందులో భాగంగా మనిషి నల్లగా ఉన్నా మనసు మంచిదని.. నైట్ 11 గంటలకు కాల్ చేస్తే చెప్పండి వర్ష గారు అంటాడని వర్ష చెప్పింది. అయితే ఇదే కాన్సెప్ట్ ను తీసుకుని రాజు, శాంతిల మీద స్కిట్ రాసి పంచులేశాడు ఆది. మొత్తానికి ఆది టార్గెట్ లో పడ్డ ఇమ్మాన్యుయెల్, వర్షలకు బూస్టింగ్ ఇస్తారని అలా చేశాడో లేక వారి మీద నెగటివ్ గా చెప్పాలని ప్రయత్నించాడో కాని ఆది స్కిట్ కన్నా చివర్లో రాజు, శాంతిల పర్ఫార్మెన్స్ అదరగొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: