మాస్ మహరాజ్ రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వచ్చింది క్రాక్. రవితేజ ఫ్యాన్స్ కోరుకునే అసలు సిసలైన సినిమాగా క్రాక్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ రోజు కొన్ని ఇబ్బందులు ఎదురవగా వాటిని దాటుకుని రవితేజ క్రాక్ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా 17 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేయగా 9 రోజుల్లో 23.63 కోట్ల వసూళ్లు రాబట్టింది.

రవితేజ క్రాక్ తో మరోసారి తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేశాడు. కరెక్ట్ సినిమా పడితే రవితేజ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో క్రాక్ ప్రూవ్ చేస్తుంది. ఇక ఈ సినిమా 9 రోజుల్లో లాభాల బాట పట్టింది. మాస్ రాజా స్టామినాకు ఇది నిదర్శనమని చెప్పొచ్చు. రవితేజ క్రాక్ మొదటి రోజు 6.54 కోట్ల వసూళ్లు రాబట్టగా 9వ రోజు ఏపి, తెలంగాణాలో 1.5 కోట్లతో దూసుకెళ్తుంది.

రవితేజ క్రాక్ సూపర్ హిట్ కాగా ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. వీర తర్వాత రమేష్ వర్మతో రవితేజ చేస్తున్న ఈ ఖిలాడి మీద అంచనాలు ఏర్పడ్డాయి. క్రాక్ తో హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ ఇక మీదట కథల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: