సర్కారు వారి పాటలో మహేశ్‌ ఎలా ఉంటాడు? రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో ఒక గెటప్ బయటికొచ్చేసింది. మంచు విష్ణు ఇచ్చిన పార్టీకి మహేశ్‌ ఫ్యామిలీ హాజరయింది. ఈ సందర్భంగా దిగిన ఫొటో చూస్తే.. మహేశ్‌ లుక్ కొత్తగా అనిపిస్తోంది.  

బన్నీ.. ఎన్టీఆర్.. రామ్‌చరణ్‌  సినిమా సినిమాకూ కొత్త లుక్‌తో దర్శనమిస్తారు. మహేశ్‌ మాత్రం అలా కాదు. వేసుకునే కాస్ట్యూమ్స్‌లో తప్ప ఫేస్‌లో పెద్దగా ఛేంజ్‌ కనిపించదు. లాక్‌డౌన్‌ టైంలో కర్లింగ్‌ హెయిర్‌తో టూ యంగ్‌గా కనిపించి.. కొడుకు గౌతమ్‌కు తమ్ముడిలా అనిపించాడు. రీసెంట్‌ ఫొటోలో మహేశ్‌ మరింత హ్యాండ్స్‌మ్‌ తయారయ్యాడు. ఫోటోను విష్ణు పోస్ట్‌ చేసి రోజు రోజుకు యంగ్‌ అయిపోతున్నాడని.. ఇలా కనిపించడానికి మహేశ్‌ మంచి హృదయమే కారణమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విష్ణు.

మహేశ్‌ న్యూలుక్‌కు సంబంధించిన  ఓ ఫొటోను ఆ మధ్య  ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ అవినాష్‌ గోవారికర్  షేర్‌ చేశారు. ఓ యాడ్‌ షూటింగ్‌ సందర్భంగా తీసిన ఫొటో ఇది. గత ఐదేళ్లుగా షార్ట్‌ హెయిర్‌తో కనిపించిన మహేశ్‌.. అతిథి.. పోకిరి మాదిరి మరోసారి లాంగ్‌ హెయిర్‌ మెయిన్‌టేన్‌ చేశాడనిపించింది.

మంచు విష్ణు ఇచ్చిన పార్టీ పుణ్యమా అని.. మహేశ్‌ లుక్‌ మరోసారి ట్రోల్‌ అయింది. అవినాష్‌ గోవారికర్‌ పోస్ట్ చేసిన ఫొటో యాడ్ కోసం అనుకుంటే.. లేటెస్ట్ స్టిల్‌ బట్టి చూస్తే.. సర్కారు వారి పాట కోసమే అన్నట్టుంది. సర్కారువారి పాట షూటింగ్‌ లాంఛనంగా మొదలైనా.. రెగ్యులర్‌ షూట్‌ ఇంతవరకు మొదలుకాలేదు. ముందు అమెరికాలో ప్లాన్‌ చేసి.. కుదరకపోవడంతో.. హైదరాబాద్‌కు మార్చారు. లేటెస్ట్‌ ఇన్ఫర్మ్‌మేషన్‌ ప్రకారం నెలాఖరున దుబాయ్‌లో షూటింగ్ స్టార్ట్‌ చేస్తారట. ఎక్కడ మొదలైనా.. మహేశ్‌ మరోసారి లాంగ్‌ హెయిర్‌తో కనిపించనున్నాడు. మొత్తానికి మహేశ్ బాబు న్యూ లుక్ వైరల్ అవుతోంది. మంచు విష్ణు ఇచ్చిన పార్టీకి హాజరైన మహేశ్ కాస్త వెరైటీగా కనిపించాడు.





మరింత సమాచారం తెలుసుకోండి: