ప్రస్తుతం పూరీ జగన్నాథ్ "లైగర్" మూవీ వర్క్ లో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ అర్జున్ రెడ్డి విజయ్ దేవర కొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న "లైగర్" మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇంతకు ముందు వరకు "ఫైటర్" గా ప్రేక్షకుల ముందుకు రీచయింది. లేటెస్ట్ గా ఈ సినిమా టైటిల్ ఛేంజ్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఈ టైటిల్ ఛేంజ్ కు ప్రేక్షకులు అడ్జస్ట్ అవడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అనేక ట్రోల్స్ ను ఎదుర్కొంది. ట్రోల్స్ వస్తే వచ్చాయి సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడతాయని విశ్లేషకుల అభిప్రాయం.

ఇదిలా ఉంటే, పూరీ జగన్నాథ్ తన తదుపరి చిత్రాల గురించి ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి యువహీరోలతో కాకుండా సీనియర్ హీరోస్ తో వర్క్ చేస్తే బాగుంటుందని పూరీ ఆలోచన. అందుకు తగిన స్క్రిప్ట్స్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు.

సీనియర్ హీరోస్ అనగానే పూరీకి ముందుగా నాగ్ పేరే గుర్తొచ్చింది. "సూపర్" అలాగే "శివమణి" చిత్రాల్లో నాగ్ ను పూరీ ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు. మూడవసారి మళ్ళీ నాగ్ తో వర్క్ చేయాలని పూరీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

రీసెంట్ గా సోనూ సూద్ కి ఆడియెన్స్ లో మంచి ఇమేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని పూరీ నాగ్ తో తెరకెక్కించబోయే హ్యాట్రిక్ మూవీలో సోనూ సూద్ కు కూడా కీలక పాత్ర ఇచ్చి "సూపర్" కాంబినేషన్ ను రిపీట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగిన స్క్రిప్ట్ ను కూడా పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు పూరీ.

సోనూ సూద్ ఇటీవలే "అల్లుడు అదుర్స్"లో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేశాడు. సోనూ చేతిలో ఆల్రెడీ బోలెడన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ సోనూ అలాగే నాగ్ డేట్స్ అనేవి అడ్జస్ట్ ఐతే పూరీ సూపర్ క్రేజీ స్క్రిప్ట్ తో ముందుకు వెళతాడని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: