ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...2020 సంవత్సరం  అనేది చాలా దారుణమైన సంవత్సరం అని చెప్పాలి.ఎందుకంటే కరోనా దెబ్బతో చాలా నష్టం జరిగింది. అయితే ఈ దారుణమైన సంవత్సరం వల్ల కొంతమంది రియల్ హీరోస్ బయటపడ్డారు. వాళ్ళలో సోనూ సూద్ ను మొదటిగా చెప్పుకోవాలి. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ టైములో ఇతను పేద వాళ్లకు చేసిన సాయం అంతా ఇంతా కాదు..! గమ్య స్థలాలకు చేరుకోలేక ఇబ్బంది పడుతున్నవారిని.. వారి సొంత ఊర్లకు చేర్చడమే కాకుండా ఎంతో మంది రైతులకు కూడా చేయూతనిచ్చాడు. అంతేకాదు ఎంతో మంది నిరుద్యోగులకు.. ఉపాధి కల్పించాడు. అందుకే మన సోనూ సూద్ ను.. రియల్ హీరో అన్నారు.

ఇక సోనూ సూద్ ఇటీవల బెల్లం కొండా శ్రీనివాస్ సినిమాలో హీరోగా నటించిన "అల్లుడు అదుర్స్" సినిమాలో నటించాడు.  ఆ సినిమా ఈ సంక్రాంతికే విడుదలయ్యింది. మొదటి షోతోనే ఆ సినిమాకి అట్టర్ ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. పండగ పేరు చెప్పుకుని.. ఆ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయని చెప్పుకున్నారు. కాని ఏమి రాలేదు. దాంతో ఆ సినిమాలో నటించిన సోనూ సూద్ క్రేజ్ పడిపోతుందని భావించారు. కానీ సోనూ సూద్ ది కేవలం సినిమా ప్లాప్ వల్ల పోయే క్రేజ్ కాదు. ఆయన సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా ఆయన స్థాయి వేరు. ఆయన మాత్రం ప్లాప్ అవ్వడు అంటూ రియల్ హీరోపై తమ అభిమానాన్ని చాటుతున్నారు ప్రేక్షకులు.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: