యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు సినిమాలు చేస్తున్నారు. అయితే సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. యంగ్ హీరోలకు హీరోయిన్లు దొరికినంత ఈజీగా సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టమవుతుంది. గత సినిమా హీరోయిన్ నే రిపీట్ చేయాలా.. లేకపోతే హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకోవాలో అర్ధం కాని పరిస్థితి.

చిరంజీవి సైరా సినిమాలో నయనతారనే హీరోయిన్ గా తీసుకున్నాడు. తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో క్రేజ్ ఉన్న హీరోయిన్ కాకుండా త్రిషను అనుకున్నారు. ఏమైందో తెలియదు కాని ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్ లో మళ్లీ కాజల్ నే రిపీట్ చేయాల్సి వచ్చింది.

బాలకృష్ణ పరిస్థితి కూడా అంతే .  కొన్నేళ్లుగా నయనతార తప్పించి మరే క్రేజి హీరోయిన్‌తో నటించలేదు. బాలయ్యకు ప్రతి సినిమాలో కథానాయికల కొరత ఏర్పడుతుంది. అందకే ఈయన ఎప్పుడో ఫేడౌట్ అయిన హీరోయిన్లతోనే అడ్జస్ట్ అయిపోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను‌తో చేస్తోన్న సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు. ఈ చిత్రంలో ఏమాత్రం క్రేజ్‌లేని హీరోయిన్ అంజలి  మరియు శ్రియను తీసుకోవాలనే నిర్ణయానికి సినిమా యూనిట్ వచ్చినట్టు సమాచారం.

మరోవైపు నాగార్జున హీరోగా సాల్మన్ దర్శకత్వంలో చేస్తోన్న ‘వైల్డ్ ‌డాగ్’ సినిమాలో హీరోయిన్ అవసరం లేని సస్పెన్స్ థ్రిల్లర్. ఈ చిత్రంలో నిజంగా ఒక హీరోయిన్ అవసరం అస్సలు లేదు. అందుకే అందరు మర్చిపోయిన నటి దియా మీర్జాను భార్య పాత్రలో తీసుకున్నాడు సినిమా దర్శకుడు.

ఇక వెంకటేష్ కి సైతం ఇదే పరిస్థితి. ప్రస్తుతం నారప్ప సినిమాతో బిజీ గా ఉన్న వెంకీ కి తన పక్కన ఎలాంటి హీరోయిన్ ని పెట్టాలో తెలియని పరిస్థితి . ఇక ఇలా సీనియర్ హీరోలకు సరిపడా హీరోయిన్ దొరకక చచ్చేంత చావు వచ్చిపడింది. వరసగా సినిమాలనైతే లైన్ లో పెడుతున్న ఈ ముదురు హీరోలు వారి పక్కన మ్యాచ్ అయ్యే హీరోయిన్ కోసం వెతుక్కుంటూ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: