డైరెక్టర్ గోపిచంద్ మలినేని, రవితేజ ల  కాంబోలో వచ్చిన 'క్రాక్ 'సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది..ఈ సినిమాతో వీరిద్దరి కాంబో హ్యాట్రిక్ హిట్ సాధించింది.. గతంలో వీరి కాంబినేషన్లో డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్స్ వచ్చాయి... ఈ సినిమాతో మన అందాల రాసి శ్రుతిహాసన్ రీఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ సినిమా కరోనా తర్వాత విడుదలైన మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమాతోనే కాకుండా మొట్టమొదటి బ్లాక్ బస్టర్‌గా కూడా పేరు తెచ్చుకుంది.ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా క్రాకెక్కించే వసూళ్లను రాబడుతూ.. సంక్రాంతి విన్నర్ గా నిలిచింది..

 ఇక ఈ ఏడాదిని మాస్ మహరాజ్ రవితేజ గొప్ప విజయంతో ప్రారంభించాడు.. అయితే క్రాక్ హిట్ తో మాంచి జోష్ మీదున్న మాస్ రాజా ప్రస్తుతం.. ఖిలాడి అనే చిత్రం చేస్తున్నాడు.. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అందులో ఒకటి సాఫ్ట్ రోల్ కాగా.. మరొకటి రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.ఇదిలా ఉంటే.. ఖిలాడి కథానుసారం రవితేజ, నాయిక మీనాక్షి చౌదరి మధ్య ఓ లిప్ లాక్ సీన్ కి స్కోప్ ఉందట.

తొలుత ఈ సన్నివేశం చేయడానికి రవితేజ సందేహించినా.. రమేష్ వర్మ ఈ సీన్ తాలుకూ ప్రాధాన్యాన్ని వివరించడంతో మాస్ మహారాజా అంగీకరించి చేశారట.ఈ విషయాన్ని రమేష్ వర్మ తాజాగా ఓ ఆంగ్ల పత్రికలో వెల్లడించారు. మరి.. ఖిలాడిలో ఎలాంటి సందర్భంలో ఈ లిప్ లాక్ సీన్ వస్తుందో తెలియాలంటే వేసవి వరకు వేచిచూడాల్సిందే.ఖిలాడిని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరితో పాటు డింపుల్ హయతి కూడా మరో నాయికగా నటిస్తోంది..ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయినట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: