టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పవన్ కళ్యాణ్ ని సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు కూడా చాలానే ఉన్నారు.. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది..సినిమాలు వదిలేసి ఇటివలే రాజకీయ రంగంలో అడుగుపెట్టిన మన పవన్ కళ్యాణ్ కి.. ఆయన అభిమానులు వెన్నంటే ఉండి మరీ ముందుకు నడిపించారు.. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్ళీ అభిమానుల కోరిక మేరకు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.. ఇక కేవలం ప్రేక్షకులే కాదు..

ఇండ్రస్టీ లోని ఎంతో మంది సినీ నటులు పవర్ స్టార్ అంటే ఇష్టపడతారు.. అందుకే వీలైనప్పుడల్లా పవన్ ఫై అభిమానాన్ని చూపిస్తుంటారు. ఇప్పటికే పలువురు హీరోలు , హీరోయిన్స్ పవన్ ఫై తమకున్న అభిమానాన్ని చాటుకోగా..తాజాగా నటి అర్చన సైతం పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అని తెలిపింది.బాలాదిత్య, అర్చన హీరో హీరోయిన్లుగా నర్రా శివనాగేశ్వరరావు(శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్‌.ఆర్‌. చౌదరి నిర్మించిన అన్నపూర్ణమ్మగారి మనవడు చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్బంగా చిత్ర ప్రమోషన్ లలో పాల్గొన్న ఈమె..

తన అభిమాన హీరోల గురించి మాట్లాడింది.హిందీలో అమితాబ్, షారూక్ ఖాన్ అంటే చాలా ఇష్టం.తెలుగులో చిరంజీవి, ప్రభాస్, పవన్ కల్యాణ్ అంటే బాగా ఇష్టం.ఖుషీలో పవన్ కల్యాణ్‌ను చూసి నేనే కాదు ప్రతి అమ్మాయి ఇష్టపడింది.. అప్పట్నుంచి ఆయన సినిమాలన్నింటినీ చూస్తున్నాను.వకీల్‌సాబ్ టీజర్ నాకు చాలా బాగా నచ్చిందని అర్చన పేర్కొంది..పవన్ కళ్యాణ్ గారి రీఎంట్రీ మూవీ కోసం ఒక అభిమానిలా నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానంటూ చెప్పింది అర్చన..ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: