తెలుగు ప్రేక్షకులు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. లేదంటే గతేడాది జూలైలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే చిత్రం వాయిదా పడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు ఆ విధంగానే పెరుగుతూ పోతున్నాయి. దర్శకధీర, జక్కన్న రాజమౌళి ఆర్ఆర్‌ఆర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు టీజర్లు విడుదలయ్యాయి. రామరాజు టీజర్‌కు కొమరం భీమ్, కొమరం భీమ్ టీజర్‌కు రామరాజు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఇక తాజాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ కొత్త అప్డేట్‌ను ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ మొదలైందంటూ ఆయన తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. ‘నా రామరాజు, భీమ్ ఏదైతే సాధించాలని అనుకున్నారో.. దాన్ని నెరవేర్చేందుకు ఇద్దరూ కలిశారు’ అంటూ పోస్ట్‌పై రాసుకొచ్చారు. రాజమౌళి ఈ పోస్ట్‌లో ఓ ఫొటోను సైతం పెట్టారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకున్న ఈ ఫొటో అప్పుడే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. క్లైమాక్స్ షూటింగ్ కూడా మొదలైందని రాజమౌళి పోస్ట్ పెట్టడంతో అటు రామ్ చరణ్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకరు అలియా భట్ కాగా.. మరొకరు బ్రిటిష్ నటి ఆర్‌ఆర్ఆర్‌లో ఫిమేల్ లీడ్స్‌గా చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. యం.యం. కీరవాణి ఆర్ఆర్‌ఆర్‌కు సంగీతం సమకూర్చుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మోషన్ పోస్టర్, టీజర్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: