ఒకప్పుడు శోభన్ బాబుకు లవర్ బాయ్ గా ఉన్న క్రేజ్..ఆ తర్వాత జనరేషన్ లో జగపతిబాబుకు వచ్చింది. ఎక్కువగా ఇద్దరు హీరోయిన్లతో నటిస్తూ మహిళా ఫ్యాన్స్  ఆదరించేలా నటించి మెప్పించాడు. అంతే కాదు అప్పట్లో జగపతి బాబు, సౌందర్య హిట్ పెయిర్ గా నిలిచింది. ఒకప్పుడు వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. సర్దుకుపోదాం రండి, మూడు ముక్కలాట, భల్లే బుల్లోడు.. ఇలా చాలా సినిమాల్లో నటించారు. అదే సమయంలో జగపతి బాబుకు ప్లే బాయ్ గా కూడా మంచి పేరుంది. తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో అందులో తప్పేం లేదని.. సంపాదించినదంతా అలాగే తగలేశానని జగపతి బాబు చెప్పాడు. అంతే కాదు తనకు సౌందర్యకు ఎఫైర్ ఉందని అందరూ అనుకుంటున్నారని. . అది తన దాకా వచ్చిందని చెప్పాడు. తనకు సౌందర్యకు ఎఫైర్ ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. అయితే ఇది లైంగి క సంబంధం కాదని అన్నాడు. సౌందర్య కుటుంబం, తనతో చాలా క్లోజ్ గా ఉంటారని..

సౌందర్య అన్నయ్య కూడా తనకు బాగా పరిచయమని చెప్పుకొచ్చాడు. తాను వాళ్లింటికీ.. . తనింటికి వాళ్లూ వచ్చేవారని జగపతి బాబు ఇంటర్వ్యూలో చెప్పాడు. రెండు కుటుంబాల మధ్య స్నేహ బంధం ఉండేదని జగపతి బాబు చెప్పాడు. సౌందర్యకు తనకు మధ్య ఎఫైర్ ఉందని అందరూ అనుకుంటున్నట్లు తన దాకా వచ్చిందని జగపతి బాబు చెప్పాడు. ఫ్రెండ్ షిప్ ని అందరూ లైంగిక సంబంధంగా అర్ధం చేసుకున్నారని ..  అయితే ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్నానే తప్ప ఎప్పుడూ పట్టించుకోలేదని జగపతి బాబు తేల్చి చెప్పాడు

మరింత సమాచారం తెలుసుకోండి: