మాస్ మహరాజ్ రవితేజతో మూడు సినిమాలు తీసి మూడు సినిమాలు హిట్ అందుకున్నాడు డైరక్టర్ గోపీచంద్ మలినేని. రవితేజతో డాన్ శీను, బలుపు సినిమాలు చేసిన గోపీచంద్ మలినేని హ్యట్రిక్ సినిమాగా క్రాక్ తెరకెక్కించారు. మాస్ రాజా ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమాగా సంక్రాంతి పందెం కోడిగా క్రాక్ వసూళ్లు అదరగొడుతున్నాయి. సినిమా రిలీజ్ నాడు రెండు ఆటలు లేటవడం కూడా సినిమాను మరింత రేంజ్ కు తీసుకెళ్లాయని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి రవితేజకు, డైరక్టర్ గోపీచంద్ మలినేనికి ఫోన్ చేసి మాట్లాడారట. సినిమా హిట్ అయినందుకు కంగ్రాట్స్ చెప్పినట్టు తెలుస్తుంది. ఇక చిరు పిలుపుతో డైరక్టర్ గోపీచంద్ మలినేని మెగాస్టార్ ను ఇంట్కెళ్లి కలిశారు. చిరుకి క్రాక్ విపరీతంగా నచ్చేసిందట. గోపీచంద్ ను ఇంటికి పిలిచి మరి అభినందించారట చిరంజీవి. ఇదే విషయాన్ని గోపీచంద్ తన ట్విట్టర్ లో చెప్పారు.

ఇది తనకు మెగా డే అని.. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుండి అభినందనలు కమర్షియల్ సక్సెస్ కు నిజమైన సాక్ష్యం లాంటిది. చిరంజీవి గారితో ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి నేర్చుకుంటాను.. గడిపిన సమయం ఎంత తక్కువైనా సరే ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకుంటామని చెప్పాడు డైరక్టర్ గోపీచంద్ మలినేని. మొత్తానికి గోపీచంద్ మలినేని చిరు నుండి ప్రశంసలు అందుకున్నారు. మెగాస్టార్ కన్ను పడ్డది అంటే ఇక డైరక్టర్ కు త్వరలోనే మెగా ఛాన్స్ వచ్చినట్టే లెక్క. క్రాక్ రిలీజ్ కు ముందు బాలకృష్ణతో సినిమా ప్లాన్ చేసుకున్న గోపీచంద్ మలినేని క్రాక్ హిట్ అవడంతో బాలయ్య ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.                                                          



 

మరింత సమాచారం తెలుసుకోండి: