క్రేజీ ప్రాజెక్టులో వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వదిలేసుకుందో ముద్దు గుమ్మ. ఎవరా అమ్మడు? ఏంటా కథ? తెలుసు కోవాలని ఉందా? అయితే ఈ వార్త చదవాల్సిందే. బాలీవుడ్ యంగ్ హీరోల్లో బాగా పాపులరైన స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా. అతను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు సాధించాయి. అంతే కాదు అతనికి కూడా స్టార్ డమ్ తీసుకొచ్చాయి. ఈ హీరో తాజాగా చేస్తున్న 'డాక్టర్ జి' సినిమా కూడా కొత్తగా ఉంటుందని ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ గా మన తెలుగు ‘జెర్సీ’ సినిమా హిందీ రీమేక్‌లో నటించిన ముద్దు గుమ్మ మృనాల్ ఠాకూర్ ను ఎంపిక చేయడం జరిగిందిట. డాక్టర్ జీ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరిగి పోయాయి. కొన్ని రోజుల క్రితం టెస్ట్ షూట్ కూడా జరిపారు. కాని ఇంతలోనే ఏమైందో ఏమో? ఈ సినిమా నుండి మృనాల్ తప్పుకుందట. డాక్టర్ జీ మూవీ యూనిట్ సభ్యుల ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. మృనాల్ ముందే కమిట్ అయిన కు ఇతర ప్రాజెక్టులు ఉండటం వల్ల డేట్లు సర్దుబాటు చేయలేక పోయిందట. ఆ కారణంగానే క్రేజీ ప్రాజెక్టును వదులు కోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

మృనాల్ ఒప్పుకున్న సినిమాలన్నీ కరోనాకు ముందే కమిట్ అయినవి అట. కరోనా కారణంగా ఆమె డేట్లు మొత్తం గందరగోళంలో పడిపోయాయి. దీంతో 'డాక్టర్ జి' సినిమాకు అనుకున్న టైంలో డేట్లు సర్దుబాటు అయ్యే పరిస్థితి లేదు. దీంతో కఠిన నిర్ణయం తీసుకున్న మృనాల్.. సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిందట. అయితే మూవీ యూనిట్ సభ్యులతో విభేదాల కారణంగానే సినిమా నుండి మృనాల్ తప్పుకుందని పుకార్లు కూడా వస్తున్నాయి. మొత్తానికి విషయం హాట్ టాపిక్ అయ్యింది.  డాక్టర్ జీ సినిమా అమ్మాయిలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: