ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. సౌత్ ఇండియా స్టార్ హీరో తలపతి విజయ్ కి ఎంత పాపులారిటి ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాక్సిమమ్ సౌత్ ఇండియా మొత్తం మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరోగా సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా "మాస్టర్".... ‘ఖైదీ'(2019) ఫేమ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కింది ఈ సినిమా. విజయ్ సేతుపతి వంటి మరో క్రేజీ హీరో ఈ చిత్రంలో విలన్ గా నటించాడు.ఇక వరుస హిట్లతో జోరు మీద వున్న విజయ్ తరువాత సినిమా కాబట్టి  మొదటి నుండీ ఈ చిత్రం పై అభిమానులకి భారీ అంచనాలు వున్నాయి. తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా ఈ చిత్రం పై మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటి నడుమ జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది. కొంతమంది ఈ చిత్రం బాగుంది అన్నారు.. మరికొంత మంది బాలేదు అన్నారు.. అయినా సరే ‘మాస్టర్’ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతుందనే చెప్పాలి.

ఇక ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే....నైజాం లో 3.24 కోట్లు వసూలు చేసింది.ఆంధ్రప్రదేశ్ లో 9.25 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా ...తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ సినిమా కి  9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 12.49 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 3.49 కోట్ల వరకూ లాభాలను మిగిల్చిందని చెప్పొచ్చు.సోమవారం రోజున కూడా ఈ చిత్రం 0.73 కోట్ల షేర్ ని రాబట్టి సూపర్ హిట్ అయ్యింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: