యంగ్ స్టార్ హీరో రామ్ పోతినేని ఈసారి ''రెడ్'' సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. సినిమాకు పూర్తి పాజిటివ్ టాక్ రాలేదు కానీ కలెక్షన్లలో మాత్రం ఈ చిత్రం రోజురోజుకూ పుంజుకుంటోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సంక్రాంతి హాలిడేస్ లో మంచి వసూళ్లే రాబట్టింది. మొదటి రోజే దాదాపు 5 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ చిత్రం.. రామ్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఆ తర్వాత కూడా అదే స్పీడు కొనసాగిస్తూ మొత్తంగా నాలుగు రోజుల్లో 22.70 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందని.. ఐదో రోజు 1.16 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు.

ఏరియాల వారీగా కలెక్షన్ రిపోర్ట్ ఒకసారి పరిశీలిస్తే.. నైజాం- 4.90 కోట్ల రూపాయలు.. సీడెడ్ - 2.45 కోట్ల రూపాయలు.. ఆంధ్రా - 5.75 కోట్ల రూపాయలు షేర్ రాబట్టినట్లు సమాచారం. మొత్తంగా నాలుగు రోజులు కలిపి వరల్డ్ వైడ్ గా 22.70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించిందట. మొత్తం మీద 13.59 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ఐదవ రోజున మొత్తం 1.16 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అంటే మొత్తంగా చూసుకుంటే రామ్ 'రెడ్' సినిమా ఐదు రోజుల్లో 14.75 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయని అంటున్నారు. కాగా 'రెడ్' సినిమాలో రామ్ డబుల్ రోల్ చేశాడు. ఇది తమిళ సూపర్ హిట్ 'తడమ్' సినిమా స్టోరీ లైన్ తో తెరకెక్కిన చిత్రం. రెడ్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: