ఇటీవల కాలంలో పెళ్లి చేసుకున్న మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత మరింత జాయ్ ఫుల్ లైఫ్ గడుపుతోంది. వివాహమై నెల రోజులు తిరగకుండానే.. కెమెరా ముందుకు వచ్చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో కూడా పెళ్లికి ముందు కన్నా ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అభిమానులతో చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నారు.

లేటెస్ట్ గా.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె షేర్ చేసిన ఓ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఫొటో పోస్ట్ చేసిన నిహారిక.. సదరు ఫొటోలో ఓ సీక్రెట్ ఉన్నట్లు మాట్లాడారు. అయితే సీక్రెట్ మాత్రం 'అతనొక్కడికే తెలుసు' అంటూ ఆసక్తి పెంచారు! ఆమె కావాలనే.. నెటిజన్లలో సస్పెన్స్ క్రియేట్ చేయడం కోసం ఇలా చేసినట్లు కనిపిస్తోంది. మరి ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే..?

నిహారిక ఈ పోస్టులో సెంటర్ ఫ్రెష్ యాడ్లో మాదిరి నోటికి తాళం వేసుకున్నట్లు నిహారిక కనిపిస్తున్నారు. ఈ ఫొటోకి క్యాప్షన్ గా.. ''నేను ఆ సీక్రెట్ చెప్పను.. ఒక వేళ చెప్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది?' అంటూ చిలిపిగా ప్రశ్నించిందీ కొణిదెల వారసురాలు. అయితే.. ఆ సీక్రెట్ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలో మాత్రం హింట్ ఇచ్చారు.

'ఆ సీక్రెట్ .. జోసెఫ్ రాధిక్ ఒక్కడికే తెలుసు' అని కామెంట్ పెట్టారు. అసలు ఇంతకీ ఈ జోసెఫ్ రాధిక్ ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు.. నిహారిక - చైతన్య పెళ్లి ఫొటోలను తీసిన ఫొటో గ్రాఫర్. ఆయన సృజనాత్మకతో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ గుర్తుంది కదా.  ఇంతకూ ఈ ఫొటోగ్రాఫర్ కు మాత్రమే తెలిసిన ఆ సీక్రెట్ ఏంటా? అని నిహారిక అభిమానులు, నెటిజన్లు బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: