తెలుగు చిత్ర పరిశ్రమలో తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఢిల్లీ భామ తాప్సీ ప‌న్ను. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది సినిమాలను చేస్తూ హీరోయిన్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తాప్సీ. ఈ సొట్టబుగ్గల సుందరి అన్ని తరహా పాత్రల్లో నటిస్తుంది.

ఇక ప్రస్తుతం ర‌ష్మీ రాకెట్ చిత్రంలో న‌టిస్తోంది తాప్సీ. అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీ డెన్మార్క్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ మ‌థియాస్ బోయెతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతుంది. ఇక అప్పుడప్పుడు మ‌థియాస్ తో వెకేష‌న్ల‌కు వెళ్లిన ఫొటోలు సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది ఈ భామ. త‌న రిలేష‌న్‌షిప్ స్టేట‌స్ గురించి ప‌బ్లిగ్గా ఎప్పుడూ మాట్లాడ‌రెందుక‌ని తాప్సీని ఓ ఇంట‌ర్వ్యూలో అడిగారు.

అయితే ఈ విషయంపై తాప్సీ స్పందిస్తూ.. ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తితో డేట్ చేయ‌డం నాకిష్టం లేదు. నా వ్య‌క్తిగ‌త, వృత్తిప‌ర‌మైన జీవితాలు వేర్వేరు అంటూ సమాధానం ఇచ్చారు. ఇక నాకు సంబంధించిన వారి పుట్టిన‌రోజుల్లో పాల్గొన్న‌పుడు ఏదో ఒక స్టిల్ ను పంచుకుంటాను. నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో భాగ‌మైన‌ మథియాస్ విష‌యంలో అదే చేశానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. పెండ్లి ప్లాన్ గురించి మాట్లాడుతూ.. నేను ఏదో ఒక‌సారి ఐదారు సినిమాలు చేయ‌డానికి బ‌దులు రెండుమూడు సినిమాలే చేయడంపై దృష్టిపెడ‌తాను. అప్పుడే నా వ్య‌క్తిగ‌త జీవితం కోసం స‌మ‌యాన్ని కేటాయించే అవ‌కాశం దొరుకుతుంద‌ని చెప్పుకొచ్చింది.

ఇక ప్ర‌స్తుతానికి త‌న ఫోక‌స్ అంతా సినిమాల‌పైనే ఉంద‌ని తెలిపారు. సినిమాలు త‌గ్గించాల‌నుకున్న త‌ర్వాత పెండ్లి గురించి ఆలోచిస్తాన‌ని చెప్ప‌క‌నే చెప్పింది ఈ భామ. తాప్సీ ర‌ష్మీ రాకెట్తోపాటు త‌మిళ్‌లో జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రంతోపాటు మ‌రో సినిమా కూడా చేస్తోంది. హిందీలో మ‌రో ప్రాజెక్టును లైన్ లో పెట్టింది తాప్సీ

మరింత సమాచారం తెలుసుకోండి: