ఆరెక్స్ 100 సినిమాతో తనకంటూ ఓ మార్క్ ఏర్పరచుకున్నాడు డైరక్టర్ అజయ్ భూపతి. ఆ సినిమాతోనే కార్తికేయ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇద్దరు తెలుగులో సూపర్ క్లిక్ అయ్యారు. బోల్డ్ కంటెంట్ అయినా ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ తో డైరక్టర్ గా మంచి మార్కులు తెచ్చుకున్నాడు అజయ్ భూపతి. ఇక తన సెకండ్ సినిమాగా మహా సముద్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్నారు. క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమానే కాదు నెట్ ఫ్లిక్స్ తో అజయ్ భూపతి ఓ వెబ్ సీరీస్ ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఆరెక్స్ 100 లాంటి కథతోనే ఈ కొత్త వెబ్ సీరీస్ ఉంటుందని అంటున్నారు. ఈమధ్య వెబ్ సీరీస్ లు అన్ని అడల్ట్ కంటెంట్ తోనే వస్తున్నాయి. కొన్ని మాత్రం డిఫరెంట్ స్టోరీస్ తో తీస్తున్నారు. ఆరెక్స్ 100 డైరక్టర్ మాత్రం వెబ్ సీరీస్ ను కూడా బోల్డ్ కథతో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ కోసం నెట్ ఫ్లిక్స్ నుండి భారీ మొత్తాన్ని అందుకున్నాడట అజయ్ భూపతి.

ఓ పక్క సినిమా షూటింగ్ చేస్తూనే వెబ్ సీరీస్ ను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడని తెలుస్తుంది. ఆరెక్స్ 100 సినిమాతో డైరక్టర్ గా తన టాలెంట్ చూపించిన అజయ్ భూపతి మహా సముద్రంతోనే కాదు వెబ్ సీరీస్ తో కూడా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతాడని అంటున్నారు. మరి ఈ డైరక్టర్ వెబ్ సీరీస్ లో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటాడో చూడాలి. తన మొదటి వెబ్ సీరీస్ అది కూడా అడల్ట్ కాన్సెప్ట్ మూవీ అయితే పాయల్ కే మొదట ప్రిఫరెన్స్ ఇస్తాడని అంటున్నారు. అదే జరిగితే మాత్రం మళ్లీ వెబ్ సీరీస్ లో కూడా వీరి కాంబో సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క.
 

మరింత సమాచారం తెలుసుకోండి: