మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా క్రాక్. మంచి యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా రవితేజ మార్క్ కామెడీ, పవర్ఫుల్ యాక్షన్, కమర్షియల్ హంగులు కలబోతగా దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి జికె విష్ణు ఫోటోగ్రాఫీ ని అందించగా సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఈ మూవీ ని ఠాగూర్ మధు ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సక్సెస్ అందుకుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అప్సర రాణి ఒక ప్రత్యేక గీతంలో మెరిసింది. ఇక ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన సినిమాలు అన్నింటిలోకి ఈ క్రాక్ మూవీ భారీ స్థాయి కలెక్షన్ తో దూసుకెళుతోందని, ఇటీవల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని కూడా సునాయాసంగా దాటేసి బయ్యర్లకు ప్రస్తుతం లాభాల పంట పండిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.

పోతురాజు రవిశంకర్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ అత్యద్భుత నటన, హీరోయిన్ శృతి హాసన్ అందం, అభినయం, విలన్ పాత్రలో నటించిన సముద్రఖని యాక్షన్, థమన్ అందించిన సాంగ్స్, బాక్ గ్రౌండ్ స్కోర్, అందరినీ ఎంతో ఆకట్టుకున్న జికె విష్ణు ఫోటోగ్రఫీ వెరసి క్రాక్ సినిమాకి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చిపెట్టాయి. ఇక చాలా రోజుల అనంతరం రవితేజ కి హిట్ రావడంతో పలువురు ఇతర హీరోల అభిమానులు సైతం ఈ సక్సెస్ పై హర్షం వ్యక్తం చేస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మూవీ సక్సెస్ పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి క్రాక్ మూవీలో పోతురాజు వీర శంకర్ గా ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు రవితేజ. మరి ఈ సినిమా ఓవరాల్ గా ఎంత మేర కలెక్షన్ రాబడుతుందో తెలియాలంటే  మరకొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....... !!

మరింత సమాచారం తెలుసుకోండి: