ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ  "క్రాక్" సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకొని జోష్ లో ఉన్నాడు. దాదాపుగా పదేళ్లుగా సరైన హిట్ లేని రవితేజ స్టార్ రేస్ లో పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యే సమయంలో క్రాక్ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు. తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని క్రాక్ కలెక్షన్లతో నిరూపించాడు మాస్ మహారాజ్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతుంది. తనతో డాన్ శీను, బలుపు వంటి హిట్ చిత్రాలను తీసిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రంగా తెరకెక్కించి హ్యాట్రిక్ హిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ చిత్రం ఇప్పటికే భారీ లాభాలను తెచ్చిపెట్టి అదిరిపోయే హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగానే మాస్ మహారాజ్ రవితేజ “ఖిలాడి” అనే మరో ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను టేకప్ చేసాడు. ప్రస్తుతం ఖిలాడి సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఫిలింనగర్ లో క్రేజీ గాసిప్ చక్కర్లు కొడుతుంది. అదేమిటనగా గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాకు సీక్వల్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈ ఈక్వల్ పై ఆసక్తిగా ఉన్నాడని సమాచారం.

ఎందుకనగా మాస్ మహారాజ్ కి చాలా రోజుల తర్వాత క్రాక్ సినిమాతో భారీ విజయం దక్కింది. అందుకనే రవితేజ కూడా క్రాక్ సీక్వల్ పై ఆసక్తి కనబరుస్తున్నారని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రాన్ని కూడా స్టార్ట్ చెయ్యడానికి మాస్ మహారాజ్ పెద్దగా సమయం తీసుకోరని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఏది ఏమైనప్పటికీ మాస్ మహారాజ్ క్రాక్ సినిమాతో మునపటి ఫామ్ లోకి వచ్చాడని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: