మిల్కీ బ్యూటీ తమన్నా సినీ పరిశ్రమలో 15 ఏళ్లు దాటుతున్నా కూడా ఇప్పటికి ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ క్రేజ్ తెచ్చుకున్న తమన్నా మధ్యలో కెరియర్ గాడి తప్పినట్టు అనిపించినా మళ్లీ తిరిగి పూర్వ వైభవం తెచ్చుకుంది. తెలుగులో ఎఫ్2తో హిట్ ట్రాక్ ఎక్కిన అమ్మడు వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది. కేవలం స్టార్ హీరోలతోనే కాదు సత్యదేవ్ లాంటి యువ హీరోల పక్కన నటిస్తుంది అమ్మడు.

ఇక లేటెస్ట్ గా తమిళ క్రేజీ మూవీ నానే వరువెన్ సినిమాలో కూడా తమన్నా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. సెల్వ రాఘవన్, ధనుష్ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీకి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తమిళ, తెలుగు భాషల్లో తమన్నా ఇప్పటికి మంచి ఛాన్సులు అందుకుంటుంది. అంతేకాదు ఏ హీరోయిన్ అయినా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే అందరికి అందుబాటులో ఉండేలా తమన్నా ఎలాంటి సినిమాకైనా ఓకే చెబుతుంది. చిరు, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో నటిస్తున్న మిల్కీ బ్యూటీ సత్యదేవ్ లాంటి యువ హీరోతో కూడా జోడీ కడుతుంది.

నాన్ వరువెన్ సినిమాలో ధనుష్ సరసన ఛాన్స్ అందుకున్న తమన్నాసినిమా హిట్టైతే అక్కడ కూడా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో అమ్మడి ఫాం చూస్తుంటే మరో ఐదారేళ్లు ఇదే జోష్ కొనసాగించేలా ఉంది. తమన్నా ని చూసి మిగతా హీరోయిన్స్ కుళ్లుకునేలా అమ్మడికి ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులో మాత్రం తమన్నా సీనియర్ స్టార్ కు బెస్ట్ ఆప్షన్ గా మారింది. తప్పకుండా అమ్మడితో మళ్లీ రిపీట్ కాంబినేషన్స్ సెట్ చేసినా చేయొచ్చని అంటున్నారు.          




మరింత సమాచారం తెలుసుకోండి: