మెగాపవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. 1920ల కాలం నాటి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.


ఇక వీరిద్దరి పాత్రలు సినిమాలో ఎంతో అద్భుతంగా ఉంటాయని, ఈ సినిమాని వారి అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఆలియా భట్, ఒలివియ మోరీస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, అలానే హీరోలిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్ రెండూ కూడా యూట్యూబ్ లో అద్భుతమైన రీతిలో వ్యూస్, లైక్స్ దక్కించుకుని సినిమాపై అందరిలోనూ భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి.


ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమా క్లైమాక్స్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నామని, హీరోలిద్దరూ కూడా ఒకరిని మించేలా మరొకరు ఎంతో గొప్పగా నటిస్తున్నారని యూనిట్ నేడు ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. కాగా ఆ పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. నిజానికి ఈ సినిమాకి సంబంధించి చాలా రోజుల నుండి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో కొద్ది రోజులుగా పలువురు ప్రేక్షకులు, అభిమానులు అప్ డేట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది అంటూ న్యూస్ బయటకు రాగానే అందరిలోనూ ఒకటే ఉత్సాహం నెలకొంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానుందని, అలానే రాబోయే మరకొద్దిరోజుల్లో మూవీ కి సంబందించి వరుసగా అప్ డేట్స్ రానున్నాయని అంటున్నారు. కాగా ఒకరకంగా ఇది ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కి మంచి పండుగ న్యూస్ అని అంటున్నారు విశ్లేషకులు. ........ !!

మరింత సమాచారం తెలుసుకోండి: