మాస్ మహారాజా రవితేజ చాలా సినిమాల ఫ్లాప్స్ తరువాత కరాక్ తో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చేశాడు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల తొమ్మిదో తారీకు రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లతో దూసుకు పోతోంది. ఇద్దరు కుర్ర హీరోలతో పోటాపోటీగా సినిమా రిలీజ్ చేసిన రవితేజసంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఈ సినిమా తర్వాత రవితేజ కిలాడి అనే సినిమా చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ఇద్దరూ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఎందుకో కానీ మొదటి నుంచి కూడా రవితేజ కాస్త రొమాన్స్ సన్నివేశాలకు దూరంగానే ఉంటాడు. 


కానీ ఈ సినిమా కోసం ముద్దు సీన్లలో నటించాడని అంటున్నారు. నిజానికి ఇది లేటు వయసులో రిస్కు చేయడం అనే చెప్పాలి. ఎందుకంటే రవి తేజ వయసు తక్కువేమీ కాదు. గతంలో ఇలాగే నాగార్జున కూడా మన్మధుడు 2 సినిమా కోసం రకుల్ ప్రీత్ తో లిప్ లాక్ సీన్స్ చేసినప్పుడు ఆయన మీద చాలా ట్రోల్స్ వచ్చి పడ్డాయి. ఇద్దరు కొడుకులు ఉన్న నీకు కుర్ర హీరోయిన్స్ తో ఇది అవసరమా అంటూ ఆయన ఏకిపారేశారు. 


అలాంటి సీన్స్ ఇప్పుడు రవితేజ చేయటంతో ఇది ఆయనకు రిస్క్ గానే భావించాలని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ సినిమాలో ముద్దు సీన్ చేయనని రవితేజ ఎంత బెట్టు చేసినా సరే కిలాడి దర్శకుడు రమేష్ వర్మ ఈ సీన్ కి ఉన్న విశిష్టత రవితేజకి తెలియజెప్పి మరి ఈ సీన్లో నటింప చేశాడని అంటున్నారు. ఇక మీనాక్షి చౌదరి, రవితేజ మధ్య ఉన్న ఈ ముద్దు సీను తాజాగా వైజాగ్ లో షూట్ చేశారని అంటున్నారు. ఈ ఏడాది సమ్మర్ సీజన్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి జనాలు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: