అల్లు అరవింద్ ఒక వ్యక్తిని అంచనా వేయడంలో అదేవిధంగా ఒక కథను ఎన్నుకోవడంలో చాల తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాంటి బ్యాలెన్స్ ఉన్న వ్యక్తి రవితేజ విషయంలో పొరపాటు చేసాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘క్రాక్’ సినిమా విడుదలకు ముందు రవితేజా నటిచిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ‘డిస్కోరాజా’ ‘నేలటిక్కేట్’ ఇలా వరస ఫ్లాప్ లుగా మారడంతో మాస్ మహారాజా మార్కెట్ పూర్తిగా పడిపోయింది.


దీనితో అప్పట్లో రవితేజాకు అడ్వాన్స్ లు ఇచ్చిన అనేకమంది నిర్మాతలు రకరకాల కారణాలు చెపుతూ అతడి దగ్గర నుండి నెమ్మదిగా అడ్వాన్స్ లు వెనక్కు తీసుకుని వెళ్ళిపోయారు అన్న గుసగుసలు కూడ వినిపించాయి. అయితే హీరోల ఫెయిల్యూర్ లను పెద్దగా పట్టించుకోని అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ యూవీ క్రియేషన్స్ సహ నిర్మాణంలో మారుతీ దర్శకత్వంలో ఒక మూవీని రవితేజాతో చేయడానికి కథతో సహా అన్నీ ఫైనల్ చేసుకుని చివరి నిముషంలో క్యాన్సిల్ చేసారు.


దీనికి కారణం పారితోషిక విషయంలో రవితేజా చూపెట్టిన పట్టుదల అని తెలుస్తోంది. తన సినిమాల మార్కెట్ బాగా లేకపోయినప్పటికీ తన పారితోషికం విషయంలో ఏవిధంగాను రాయితీలు ఇవ్వలేనని మాస్ మహారాజ స్పష్టంగా చెప్పడంతో లెక్కలు వేసుకున్న అరవింద్ ఆ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసాడు అని అంటారు.


అయితే ‘క్రాక్’ ఊహించని విజయం సాధించడంతో ఇప్పుడు నిర్మాతలు అంతా రవితేజా ఇంటి చుట్టూ తిరుగుతూ అతడికి 12 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేస్తున్నట్లు టాక్. వాస్తవానికి అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఉంటే ‘క్రాక్’ మూవీ తరువాత విడుదల అయ్యే మూవీగా అరవింద్ రవితేజామూవీ అయి ఉండేది. ‘క్రాక్’ మూవీ తరువాత రవితేజా కు పెరిగిన క్రేజ్ తో బయ్యర్ల నుండి కూడ భారీ ఆఫర్లు వచ్చి అరవింద్ కు కాసుల వర్షం కురిసేది. అయితే కేవలం పారితోషికం విషయంలో జరిగిన బేరసారాలు వల్ల అరవింద్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను కోల్పోయాడు అంటూ ఇండస్ట్రీలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: