బాలికా వధు సీరియల్ తెలుగు వర్షన్ చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అవికా గోర్. ఆ తర్వాత అన్నపూర్ణ బ్యానర్ లో ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రాజ్ తరుణ్ హీరోగా విరిచి వర్మ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది అమ్మడు. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో వరుస అవకాశాలు అందుకుంది.

సినిమాలైతే చేస్తుంది కాని అవికా గోర్ స్టార్ క్రేజ్ దక్కించుకోవడంలో మాత్రం వెనకపడ్డది. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన అవికా గోర్ తన లుక్ కొన్ని ఆఫర్లు రాకుండా చేస్తుందని భావించి జీరో సైజ్ తో షాక్ ఇచ్చింది. ఇక మీదట రెచ్చిపోవడం పక్కా అని హింట్ ఇచ్చేలా జీరో సైజ్ తో అమ్మడు బికిని లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. అవికా గోర్ అందాల విందుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పూల్ సైడ్ బికిని ట్రీట్ ఆడియెన్స్ కు మంచి కిక్ ఇస్తుంది.

ఇంతకుముందు సినిమాల్లో పెద్దగా గ్లామర్ సైడ్ కనిపించని అవికా గోర్.. ఇక మీదట సినిమాల్లో స్కిన్ షో.. ఇంటిమేట్ సీన్స్ చేసేందుకు రెడీ అంటుంది. అందుకు ముందు హింట్ గా బికిని ట్రీట్ ఇస్తుంది. ఈమధ్యనే తన బోయ్ ఫ్రెండ్ అంటూ ఒకరిని పరిచయం చేసిన అమండు అతనితో డేటింగ్ లో ఉన్నట్టు ఉంది. మరి అవికా గోర్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆమెకు ఎలాంటి ఆఫర్లు తెస్తాయో చూడాలి. అవికా గోర్ బికిని షో కుర్రాళ్లను పిచ్చెక్కేలా చేస్తుంది. రాజు గారి గది 3 తర్వాత తెలుగులో నెక్స్ట్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న అమ్మడు ఈసారి ఛాన్స్ వస్తే మాత్రం అదరగొట్టేస్తుందని తెలుస్తుంది. తెలుగులో అవికా గోర్ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఆ లక్కీ ఛాన్స్ ఎప్పుడు ఎవరు ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: