సినిమా పరిశ్రమలో ఎవరైనా అడుగు పెడితే కచ్చితంగా చాన్స్ కోసం చూసేది హీరో వేషాల కోసమే. ఎవరికైనా హీరో కావాలన్నదే బలమైన కోరికగా ఉంటుంది. మరి అలాంటి కోరికతో అడుగుపెట్టిన వారి జీవితాలు, జాతకాలు ఇండస్ట్రీ మార్చేసింది. అక్కడ మాత్రం కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిని బట్టే కళాకారుల రాతలు మారిపోతాయి.

తేనె మనసులు సినిమాను కొత్త వారితో తీస్తున్నామని అప్పటి ప్రఖ్యాత డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు ఒక  పేపర్ ప్రకటన ఇచ్చారు. అంతే దానికి చూసి  ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఈనాటి సూపర్ స్టార్ క్రిష్ణ కూడా ఉన్నారు. అలాగే ఇప్పటి రెబెల్ స్టార్ క్రిష్ణం రాజు కూడా ఉన్నారు. అయితే ఎందుకో క్రిష్ణం రాజు మాత్రం సెలెక్ట్ కాలేదు. క్రిష్ణని హీరోగా తీసుకున్నారు. ఆ ఒక్క సినిమాతో ఆయన తిరుగులేని హీరోగా మారిపోయారు.

ఇక అవకాశాల కోసం మరింతగా ప్రయత్నాలు చేసిన క్రిష్ణం రాజు ఎట్టకేలకు చిలకా గోరిక సినిమాలో హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో విలన్ వేషాలు ఆఫర్లు గా వచ్చారు. అలా క్రిష్ణ నేనంటే నేనే సినిమాలో విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన క్రిష్ణం రాజు కొన్నేళ్ళ పాటు అలాగే కొనసాగారు. చివరికి ఆయన సొంతంగా గోపీ క్రిష్ణా  బ్యానర్ పెట్టి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు.


ఆయన వాణిశ్రీని హీరోయిన్ గా పెట్టి తీసిన లేడీ ఓరియెంటెండ్ మూవీ క్రిష్ణ వేణి సూపర్ హిట్ అయింది. అందులో కూడా విలన్ షేడ్స్ ఉన్న  హీరో పాత్రలోనే  క్రిష్ణం రాజు నటించారు. అ తరువాత భక్త కన్నప్ప సినిమా క్రిష్ణం రాజు కెరీర్ ని మార్చేసింది. ఇక దాసరి నారాయణరావు తీసిన కటకటాల‌ రుద్రయ్య సినిమాతో పక్కా మాస్ హీరో గా కూడా క్రిష్ణం రాజు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇక వెనక్కి చూసుకోలేదు. తన కెరీర్ లో మొత్తం రెండు వందల సినిమాల్లో నటించిన క్రిష్ణం రాజు అన్ని రకాలైన  పాత్రలను పోషించి రెబెల్ స్టార్ అనిపించుకున్నారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఆయురారోగ్యాలతో ఆయన మరింత కాలం పాటు పాటు  కళామ తల్లికి సేవ చేయాలని అంతా కోరుకుంటున్నారు.'

మరింత సమాచారం తెలుసుకోండి: