టాలీవుడ్ కుర్రహీరో విశ్వంత్ దుడ్డుంపూడి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదయింది. తక్కువ ధరలకే కార్లను ఇప్పిస్తానంటూ తమని విశ్వంత్ మోసం చేసారని కొందరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారి ఫిర్యాదు మేరకు విశ్వంత్ పై కేసు నమోదు చేశారు. విశ్వంత్ చేతిలో తాము మోసపోయామని తమకు న్యాయం జరగాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ లో నివసిస్తున్న రెడ్డి రామకృష్ణ అనే వ్యాపారి తనని విశ్వంత్ తో పాటు అతని తండ్రి లక్ష్మీ కుమార్ మోసం చేశారని ఆరోపిస్తున్నారు.

లగ్జరీ కారుని కేవలం 12 లక్షలు ఇస్తామని తన దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఆయన ఆరోపిస్తున్నారు. ఇన్నోవా కార్ ఇప్పిస్తామని చెప్పి విశ్వంత్, అతని తండ్రి లక్ష్మీ కుమార్ తన నుంచి తొలుత 10 లక్షలు తీసుకొని ఆ తర్వాత రెండున్నర లక్షలు తీసుకున్నారని రెడ్డి రామకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చివరికి రెడ్డి రామకృష్ణ కి విశ్వంత్, లక్ష్మీ కుమార్ కారు ఇప్పించారు. అయితే ఆ కారు తన పేరున రిజిస్టర్ చేయించాలని రెడ్డి రామకృష్ణ కోరినప్పుడు ఆ కారు పై 20 లక్షల ఫైనాన్స్ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఈ విషయం తన నుంచి దాచి తనను మోసం చేశారని రెడ్డి రామకృష్ణ ఆగ్రహించి తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ అందుకు విశ్వంత్, లక్ష్మీ కుమార్ ఒప్పుకోలేదు. దీంతో బాధితుడు రెడ్డి రామకృష్ణ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు.

ఇకపోతే 2015 వ సంవత్సరంలో విడుదలైన కేరింత సినిమాలో సెకండ్ హీరోగా నటించిన విశ్వంత్ దుడ్డుంపూడి నటుడిగా బాగానే గుర్తింపు దక్కించుకున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తేజస్వి మడివాడ సరసన విశ్వంత్ నటించారు. ఆ తర్వాత మనమంతా సినిమాలో మోహనలాల్ కుమారుడి పాత్రలో నటించి బాగా మెప్పించారు. కాకినాడ సామర్లకోట లోని ఒక బిజినెస్ ఫ్యామిలి లో జన్మించిన విశ్వంత్ అసలు పేరు విశ్వనాథ్. విశాఖలో పదో తరగతి పూర్తి చేసిన ఈయన హైదరాబాదులో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ చదివిన కోయంబత్తూర్ లో పూర్తి చేసి ఉన్నత చదువుల కొరకు ఫారిన్ వెళ్లారు. అప్పుడే ఆయనకు దిల్ రాజు కేరింత సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇటీవలే ఓ పిట్ట కథ లో కనిపించిన విశ్వంత్ ప్రస్తుతం కాదల్, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ చిత్రాల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: