జనవరి 9వ తేదీన ప్రముఖ నేపధ్య గాయని సునీత ఉపద్రష్ట.. ప్రముఖ వ్యాపారవేత్త, మాంగో మీడియా డైరెక్టర్ రామ్ వీరపనే ని వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియా లో చదువుకొని ఇండియాకి తిరిగొచ్చి వ్యాపారవేత్తగా అవతారమెత్తిన రామ్ వీరపనేని చాలా ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది. మాంగో డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న సమయంలో ఆయనకు సింగర్ సునీత పరిచయమయ్యారు. ఆమె మ్యాంగో మీడియా సంస్థకు ఎన్నో పాటలు పాడిన విషయం తెలిసిందే.

అయితే సింగర్ సునీత రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుంటానని ప్రకటించగానే చాలామంది నెటిజన్లు ఆయన యొక్క వయసు గురించి గూగుల్లో సెర్చ్ చేశారు. అయితే ఆయన వయసు గురించి మొన్నటి వరకు వెలుగులోకి రాలేదు కానీ తాజాగా ఆయన వయసు ఎంతో తెలిసిపోయింది. రామ్ వీరపనేని మే నెల 26వ తేదీన 1974 లో జన్మించారట. ఈ లెక్కన చూసుకుంటే ఆయన వయసు 47 సంవత్సరాలు. సింగర్ సునీత కి 42 ఏళ్లు కాగా.. ఆమెకు ఆయనకు వయసు వ్యత్యాసం కేవలం ఐదు సంవత్సరాలే కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కారణం సింగర్ సునీత చాలా యంగ్ గా కనిపించడమే అని చెప్పుకోవచ్చు.

ఎప్పటినుంచో స్నేహితులుగా ఉన్న సునీత, రామ్ తమ మధ్య వయసు వ్యత్యాసం కూడా చాలా తక్కువగా ఉండటంతో పెళ్లి వైపు అడుగులు వేశారు. ఐతే సునీత పిల్లలు మరియు తల్లిదండ్రులు కూడా రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుంటానని సునీత చెప్పినప్పుడు అస్సలు వ్యతిరేకించలేదు. అందుకే ఆమె కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా రామ్ వీరపనేని ని రెండవ పెళ్లి చేసుకున్నారు. నిజానికి సునీత తన 19 ఏళ్ల వయసులోనే కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరికీ ఇద్దరు సంతానం కూడా కలిగింది. కానీ కొన్నేళ్ళ తర్వాత వీళ్లు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ రోజు నుంచి ఒంటరిగానే తన పిల్లలను పెంచి పోషించిన సునీత 42 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. మొదటి పెళ్లి తనకు ఎన్నో చేదు అనుభవాలు మిగిల్చినా రెండవ పెళ్లి మాత్రం తన జీవితంలో తీపి జ్ఞాపకాలను నింపుతుందని సునీత భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: