మాజీ హీరోయిన్ రోజా సినిమాలకు పూర్తిగా దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆమె ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అధికార పార్టీ తరఫున ఆమె ఎక్కువగా తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు. ఆమె ప్రస్తుతం ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా  బాధ్యతలు నిర్వహిస్తూ నగరి ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో ఉన్నారు. సినిమాల్లో నటించడం లేదన్న మాటే గాని బుల్లితెర మీద జబర్దస్త్ సహా మల్లెమాలకు సంబంధించిన అనేక షోలు చేస్తూ సంపాదిస్తున్నారు.

 అయితే సినిమాలకి సంబంధించి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆమె సింపుల్ గా చేయలేనని చెప్పేస్తున్నారని అంటున్నారు. తాజాగా కూడా ఒక బడా సినిమాలో రోజాకి మంచి ఆఫర్ వచ్చిందట. అందులో కూడా ఒక పవర్ ఫుల్ పొలిటిషన్ రోల్ చేయమని దర్శకనిర్మాతలు కోరారట. అయితే పొలిటీషియన్ రోల్ అని ముందు కాస్త చేయడానికి సిద్ధపడినా అది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో చేయలేనని చెప్పేశారట. అదీకాక ప్రస్తుతం తన షెడ్యూల్ ప్రకారం బుల్లితెరకు మాత్రమే సమయం కేటాయించగలననీ సినిమాల కోసం టైం స్పెండ్ చేయలేనని ఆమె చెబుతున్నారట. అయితే ఆమె సినిమాలు వద్దు అనడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమె మంత్రి పదవిని ఆశిస్తున్నారు. 

కానీ కుల సమీకరణాలలో భాగంగా మొదటి టర్మ్ లో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. రెండవ టర్మ్ లో అయినా మంత్రి పదవి దక్కుతుందని ఆమె భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమాలు చేస్తూ వెళితే ఒకవేళ ఆ సినిమాలు అనుకోని వివాదాలకి కారణం అయితే తన మంత్రి పదవికి ఇబ్బంది అవుతుంది అనే భావనతో రోజా సినిమాలలో నటించడానికి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఒక వేళ సినిమా లో ఏదైనా పాత్రలో నటిస్తే ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి వివాదం వచ్చినా రాజకీయంగా తనను టార్గెట్ చేస్తారనే భయం రోజాలో ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: