మీటూ.. కొన్నాళ్ల పాటు ఈ ఉద్యమం అన్ని రంగాలనూ కుదిపేసింది. ప్రత్యేకించి సినీ రంగంలోని  కామాంధుల చేష్టలను బయటపెట్టింది. ఇప్పుడు తాజాగా మరో నటి ఓ డైరెక్టర్‌పై దారుణమైన ఆరోపణలు చేసింది. ఆ నటి షెర్లీన్ చోప్రా.. ఆ దర్శకుడు.. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌.


2005లో.. తన తండ్రి చనిపోయిన కొన్ని రోజుల తరవాత 2005 ఏప్రిల్‌లో షెర్లీన్ సాజిద్‌ను కలిసిందట. అప్పుడతను  ప్యాంట్‌లో నుంచి మర్మాంగాన్ని బయటికి తీసి చూపించి.. దాన్ని ఫీల్ అవ్వమని అడిగాడట. పురుషాంగం ఎలా ఉంటుందో నాకు తెలుసు అని షెర్లీన్ చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వచ్చిందట. అతడితో నా మీటింగ్ అతడి పురుషాంగాన్ని ఫీలవడానికి, దానికి రేటింగ్ ఇవ్వడానికి కాదు అని కూడా చెప్పానని షెర్లిన్ తాజాగా సోషల్ మీడియాలో ప్రస్తావించింది.


సాజిద్ తన పురుషాంగాన్ని బయటికి తీసి పట్టుకోమనడమే కాకుండా దాన్ని ఆస్వాదించమన్నాడని షెర్లీన్ ఆరోపించారు. నువ్వు ఎప్పుడైనా పురుషాంగాన్ని చూశావా.. ఇదిగో తీసుకో అని అన్నాడని షెర్లీన్ పేర్కొన్నారు. తాను ఊరకనే ఈ ఆరోపణలు చేయడం లేదని.. ఈ ఘటనకు సంబంధించి తన వద్ద ఫోన్ రికార్డ్ ఆధారాలు కూడా ఉన్నాయని షెర్లిన్ అంటోంది. తన తండ్రి డాక్టర్ ప్రేమ్ సాగర్ చోప్రా మరణించిన తరవాత తాను బాధలో కూరుకుపోయానని.. అలాంటి సమయంలో తనను పిలిచిన సాజిద్.. అతడి పురుషాంగం గురించి మీటింగ్ ఉంటుందని తాను అనుకోలేదని చెబుతోంది.


ఈ సాజిద్‌పై ఇప్పటికే చాలా మంది మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఏడాది పాటు నిషేధం కూడా విధించింది. అంతేకాదు, 2018లో ఆయన్ని ‘హౌస్‌ఫుల్ 4’ ప్రాజెక్ట్ నుంచి కూడా  ఇదే ఆరోపణలతో తప్పించారు. అన్నట్టు ఈ షెర్లీన్ చోప్రా మన హైదరాబాదీనే. ఇక్కడే హైద‌రాబాద్ లోనే పుట్టిన షెర్లీన్.. సికింద్రాబాద్ లో చ‌దువుకుంది. 1999లో మిస్ ఆంధ్రాగా కూడా ఎంపికైంది. వెండి మ‌బ్బు, ఏ ఫిల్మ్ బై అర‌వింద్ సినిమాల్లో నటించింది. ఇప్పటికే పలు శృంగారచిత్రాల్లో నటించిన అనుభవం షెర్లిన్ చోప్రాకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: