జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. నందమూరి తారక రామారావు  మనవడి నటనకు మంత్ర ముగ్ధులై "బ్రహ్మర్షి విశ్వామిత్ర" చిత్రం ద్వారా  బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఆ తరువాత బాల రామాయణం చిత్రంలో రాముడిగా నటించాడు.తరువాత 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా తన ప్రతిభను చాటుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. వరుస హిట్లతో ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బాస్టర్ విజయాలను తన అకౌంట్లో వేసుకున్నాడు.తన నటనతో తాతకు తగ్గ మనవడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

అయితే జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను చూశాడు అలాగే పరాజయాలను కూడా చవిచూశాడు.అలాగే తనకు వస్తున్న కొన్ని సినిమాలను అనుకోకుండా కొన్ని కారణాల చేత వదులుకోవాల్సి వచ్చింది. అందులో బొమ్మరిల్లు సినిమా కూడా ఒకటి. అసలు బొమ్మరిల్లు సినిమాను ఎందుకు రిజెక్ట్ చేయవలసి వచ్చిందో  ఇప్పుడు ఇక్కడ చదివి  తెలుసుకుందాం.


సిద్ధార్థ్,జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బొమ్మరిల్లు. 2006లో విడుదలైన ఈ చిత్రానికి యువత నీరాజనాలు పట్టారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం తోపాటు జెనీలియా,ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్ ల నటన అద్భుతంగా పండింది. అయితే తొలుత ఈ చిత్రం ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. కానీ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు.


కారణమేమంటే దిల్ రాజు బొమ్మరిల్లు స్టోరీ ని తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ కు  వినిపించాడు.అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. " స్క్రిప్ట్ బాగా నచ్చింది.అయితే నాకున్న ఇమేజ్ కారణంగా ఈ సినిమా చేయలేక పోయినందుకు చాలా బాధపడ్డా. నా ఇమేజ్ ఆ సినిమాకు న్యాయం చేయలేదు.ఎన్టీఆర్ సినిమా అంటే డాన్స్లు,ఫైట్లు,కామెడీ,హీరోయిజం,పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయని, నా అభిమానులు అంచనా వేస్తారు. అయితే ఇలాంటి సినిమాను నేను తీస్తే వారు నన్ను పెద్దగా ఆదరించలేరని,అవేవీ లేకుండా సినిమా చేస్తే నేను ఆ సినిమాకు మోసం చేసిన వాడిని అవుతాను" అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: