తమ తెలివితో,కామెడీ పండించడంలో సిద్ధహస్తులైన ఎంతో మంది నటులు జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు. కేవలం బుల్లి తెర మీదే కాకుండా వెండితెర మీద కూడా అవకాశాలు కొట్టేసి, వారికంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్నారు. వారిలో ఒకరు చమ్మక్ చంద్ర కూడా. చమ్మక్ చంద్ర మొదట జబర్దస్త్ షో ద్వారా బుల్లి తెరకు పరిచయమై, ఆ తరువాత చలన చిత్రంలో సహాయనటుడిగా పని చేస్తున్నాడు. జబర్దస్త్ షో లో తనదైన స్టైల్ లో కామెడీ తోపాటు టైమింగ్ తో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక జబర్దస్త్ షో లో కి ఎంత మంది కొత్త వాళ్లు వచ్చినప్పటికీ తన స్థానాన్ని మాత్రం ఎవరు సాధించలేకపోతున్నారు.

అయితే జడ్జిగా జబర్దస్త్ కామెడీ షో కి వ్యవహరిస్తున్న నాగబాబు గారు అనుకోకుండా ఈటీవీ మేనేజ్మెంట్ తో కొన్ని కారణాల చేత విడిపోయి, జీ తెలుగు చానల్ లోకి వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఛానల్ లో "అదిరింది "ప్రోగ్రాం కు జడ్జి గా వ్యవహరిస్తున్నారు. ఇక చమ్మక్ చంద్ర కూడా నాగబాబు జాడల్లోనే నడుస్తూ, జబర్దస్త్ కామెడీ షో ని వదిలి అదిరింది ప్రోగ్రాం కు షిఫ్ట్ అయ్యాడు. అయితే అక్కడ కూడా తన తెలివితో, కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సఫలమయ్యారు.

అయితే ప్రస్తుతం ప్రోగ్రాం ఏదైనప్పటికీ ఆడియన్స్ మాత్రం చంద్ర స్కిట్స్ కి బాగా అలవాటు పడిపోయారు. కానీ ఇటీవల జీ తెలుగులో బొమ్మ అదిరింది షో ప్రసారం అవకపోవడంతో అందులో నటించే నటుల పరిస్థితి చాలా దీనస్థితికి చేరుకుంది. అయితే చమ్మక్ చంద్ర మళ్ళీ తిరిగి జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల నాగబాబు కి,చమ్మక్ చంద్ర ల కి  మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఈ కారణం చేతనే చమ్మక్ చంద్ర జబర్దస్త్ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాడు అని సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగుతున్నాయి.

అయితే బుల్లి తెరపై కనిపించే విషయంలో డెసిషన్ తీసుకోవడంలో చమ్మక్ చంద్ర ఇంకా ఆలస్యం చేస్తే,అది ఆయన కెరియర్ లో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా చమ్మక్ చంద్ర త్వరగా డెసిషన్ తీసుకొని తన జీవితాన్ని మరో మలుపు తీసుకోవాలని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: