మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ డైరక్షన్ లో వచ్చిన సినిమా క్రాక్. మాస్ రాజా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉండటంతో ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. రవితేజతో డాన్ శీను, బలుపు సినిమాలతో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ తో గోపీచంద్ భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక క్రాక్ తో హిట్ అందుకోవడంతో గోపీచంద్ కు డిమాండ్ ఏర్పడింది. అతనితో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ గోపీచంద్ కు ఆఫర్ ఇవ్వగా.. మరో పెద్ద బ్యానర్ కూడా గోపీచంద్ తో సినిమాకు అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. క్రాక్ సినిమాతో గోపీచంద్ మరోసారి తన డైరక్షన్ టాలెంట్ చూపించాడు.

రవితేజ క్రాక్ హిట్ అవడంతో నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ సినిమా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది. డాన్ శీను టూ క్రాక్ తీసింది ఆరు సినిమాలే అయినా తన 10 ఏళ్ల కెరియర్ లో గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. క్రాక్ చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా పిలిచి అభినందించాడు అంటే గోపీచంద్ కు తగిన గుర్తింపు వచ్చినట్టే లెక్క. ఇక తన నెక్స్ట్ సినిమా కూడా ఇదే రేంజ్ హిట్ అయితే మాత్రం అతను కూడా స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే అని చెప్పొచ్చు. గోపీచంద్ తో బాలయ్య సినిమా ఉంటుందని వార్తలు రాగా డైరక్టర్ ఓకే అంటే తాము కూడా రెడీ అంటున్నారు స్టార్ హీరోలు. క్రాక్ ముందు వరకు 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే గోపీచంద్ క్రాక్ హిట్ అవడంతో 4, 5 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: